News March 18, 2024
నేటి నుంచి IPL టికెట్ల విక్రయం

మరో నాలుగు రోజుల్లో ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కాబోతుంది. చెన్నైలో జరిగే తొలి మ్యాచ్ టికెట్లు ఇవాళ్టి నుంచి విక్రయించనున్నారు. ఆన్‌లైన్‌లో ఒకరు రెండు టికెట్లు మాత్రమే బుక్ చేసుకోవచ్చు. టికెట్ ధరలు రూ.1700 నుంచి రూ.7500 వరకు ఉన్నాయి. పేటీఎం, చెన్నై సూపర్ కింగ్స్ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి బుకింగ్ ప్రారంభం కానుంది.
Similar News
News April 1, 2025
అసదుద్దీన్‌తో సీఎం రేవంత్ ఇఫ్తార్ విందు

TG: హైదరాబాద్‌లో మైనారిటీ నాయకులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు సీఎం రేవంత్ హాజరయ్యారు. ఆయనతోపాటు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కూడా విందులో పాల్గొన్నారు. ‘రంజాన్ లౌకికవాదానికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ఖురాన్ ఉద్భవించిన రంజాన్ మాసంలో కఠోర ఉపవాస దీక్షలు, ప్రార్థనలు, జకాత్, ఫిత్రా పేరుతో పేదలకు చేసే దానధర్మాలు మానవాళికి ఆదర్శం’ అని సీఎం పేర్కొన్నారు.
News April 1, 2025
నొప్పి అంటే ఏంటో చూపిస్తా: హూతీలకు ట్రంప్ మాస్ వార్నింగ్

తమ దేశానికి చెందిన నౌకలపై దాడులు ఆపాలని US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హూతీలను హెచ్చరించారు. లేదంటే మీతోపాటు ఇరాన్‌కు కూడా నొప్పి అంటే ఏంటో చూపిస్తానని వార్నింగ్ ఇచ్చారు. తమ నౌకలపై దాడులు ఆపేవరకూ హూతీలపై దాడులు ఆపమని స్పష్టం చేశారు. ఇరాన్ కూడా హూతీలకు తక్షణమే మద్దతు ఆపాలన్నారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి హౌతీలు 300 సార్లకుపైగా USకు చెందిన నౌకలపై దాడులు చేశారు
News April 1, 2025
IPL: నేడు లక్నోతో పంజాబ్ కింగ్స్ ఢీ

IPLలో భాగంగా ఇవాళ లక్నో సూపర్ జెయింట్స్‌తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. రాత్రి 7.30 గంటలకు లక్నోలో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా ఆడిన తొలి మ్యాచులోనే పంజాబ్ ఘన విజయం సాధించి జోరు మీద ఉంది. ఈ మ్యాచులో కూడా గెలిచి 2 పాయింట్లు తమ ఖాతాలో వేసుకోవాలని శ్రేయస్ అయ్యర్ సేన భావిస్తోంది. మరోవైపు లక్నో తొలి మ్యాచులో ఓటమిపాలైనా, రెండో మ్యాచులో SRHపై గెలిచింది. ఇదే జోరులో పంజాబ్‌ను ఓడించాలని యోచిస్తోంది.