News March 18, 2024

నేటి నుంచి IPL టికెట్ల విక్రయం

image

మరో నాలుగు రోజుల్లో ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కాబోతుంది. చెన్నైలో జరిగే తొలి మ్యాచ్‌ టికెట్లు ఇవాళ్టి నుంచి విక్రయించనున్నారు. ఆన్‌లైన్‌లో ఒకరు రెండు టికెట్లు మాత్రమే బుక్ చేసుకోవచ్చు. టికెట్ ధరలు రూ.1700 నుంచి రూ.7500 వరకు ఉన్నాయి. పేటీఎం, చెన్నై సూపర్ కింగ్స్ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి బుకింగ్ ప్రారంభం కానుంది.

Similar News

News October 11, 2024

ఆ 2 నగరాల్లో పావురాలు ఎగరొద్దు: పాకిస్థాన్ ఆదేశం

image

ఉగ్రవాదాన్ని ఎగుమతిచేసే పాకిస్థాన్ ఇప్పుడు వేర్పాటువాదుల దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. SCO సమ్మిట్‌కు భద్రత కల్పించడం తలకు మించిన భారంగా మారింది. OCT 12 నుంచి 16 వరకు ఇస్లామాబాద్, రావల్పిండి నగరాలను షట్‌డౌన్‌ చేస్తోంది. ఇక్కడ పావురాలు, గాలిపటాలు ఎగరకూడదని ఆదేశించింది. అందుకని పావురాల గూళ్లను తొలగించాలని సూచించింది. దీంతో మహిళా పోలీసుల సాయంతో 38 రూఫ్‌టాప్స్‌పై గూళ్లను తీసేసింది డిపార్ట్‌మెంట్.

News October 11, 2024

1.21 కోట్ల కుటుంబాలకు ‘చంద్రన్న బీమా’

image

AP: రాష్ట్రంలోని 1.21 కోట్ల BPL కుటుంబాల్లోని 3.07 కోట్ల మందిని ‘చంద్రన్న బీమా’ పరిధిలోకి తీసుకొచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. 18-70 ఏళ్లలోపు వారు ప్రమాదవశాత్తు చనిపోతే ₹10 లక్షలు, సహజంగా మరణిస్తే ₹2 లక్షల మొత్తం చెల్లించేలా ఉన్నతాధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఇందుకు ఏడాదికి ₹2,800 కోట్లు అవసరమవుతుందని అంచనా. త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు తెలుస్తోంది.

News October 11, 2024

స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం కీలక వ్యాఖ్యలు

image

TG: దసరా తర్వాత రాష్ట్రవ్యాప్తంగా కులగణన చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. రెండు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసి డిసెంబర్ 9 కల్లా రిజర్వేషన్లు ఖరారు చేస్తామన్నారు. ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. పంచాయతీల్లో రిజర్వేషన్లు పెంచుతామన్నారు. కులగణనకు బీసీ సంఘాలు సహకరించాలని కోరారు.