News March 18, 2024

పెందుర్తి ఎమ్మెల్యే ర్యాలీపై అధికారుల నిఘా

image

పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ ఆదివారం నిర్వహించిన భారీ బైక్ ర్యాలీపై ఎన్నికల అధికారులు నిఘా ఏర్పాటు చేశారు. ర్యాలీలో 100 మంది పాల్గొంటారని ఎమ్మెల్యే వర్గీయులు ముందుగా అనుమతి తీసుకున్నారు. కానీ అంతకుమించి కార్యకర్తలు, నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు. దీంతో ర్యాలీని చిత్రీకరించారు. నిబంధనల ఉల్లంఘనపై నోటీసులు జారీ చేస్తామని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.

Similar News

News April 3, 2025

గాజువాకలో యాక్సిడెంట్

image

గాజువాకలో గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాఫిక్ సీఐ కోటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. గాజువాకకు చెందిన లావేటి క్రాంతి కుమార్, శ్రీహరిపురానికి చెందిన వాసవి సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు. గురువారం ఉదయం డ్యూటీ ముగించుకొని రుషికొండ నుంచి గాజవాక వస్తుండగా షీలా నగర్ వద్ద కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు.

News April 3, 2025

విశాఖ: భర్త దాడిలో భార్య మృతి

image

విశాఖలో వివాహిత రమాదేవి చికిత్స పొందుతూ మృతిచెందింది. మాధవధారకు చెందిన రమాదేవి, బంగార్రాజు మధ్య గొడవలు జరగ్గా రమాదేవి పుట్టింటికి వెళ్లింది. గతనెల 30న బంగార్రాజు అక్కడికి వెళ్లి గొడవపడ్డాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బయలుదేరగా అడ్డగించి దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను KGHకి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. నిందితుడిని టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.

News April 3, 2025

TTC ట్రైనింగ్ కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానం: డీఈవో

image

విశాఖ జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో TTC ట్రైనింగ్ కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానించనున్నట్లు డీఈవో ప్రేమ్ కుమార్ బుధవారం తెలిపారు. ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 25లోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. మే1 నుంచి జూన్ 11 వరకు ట్రైనింగ్ ఇవన్నున్నట్లు తెలిపారు. 18 నుంచి 45 సంవత్సరాల లోపు వారు అర్హులన్నారు. పూర్తి వివరాలు, అప్లికేషన్‌కు www.bse.ap.gov.inలో చెక్ చేయాలన్నారు. మే 1 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయన్నారు.

error: Content is protected !!