News March 18, 2024

పెందుర్తి ఎమ్మెల్యే ర్యాలీపై అధికారుల నిఘా

image

పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ ఆదివారం నిర్వహించిన భారీ బైక్ ర్యాలీపై ఎన్నికల అధికారులు నిఘా ఏర్పాటు చేశారు. ర్యాలీలో 100 మంది పాల్గొంటారని ఎమ్మెల్యే వర్గీయులు ముందుగా అనుమతి తీసుకున్నారు. కానీ అంతకుమించి కార్యకర్తలు, నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు. దీంతో ర్యాలీని చిత్రీకరించారు. నిబంధనల ఉల్లంఘనపై నోటీసులు జారీ చేస్తామని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.

Similar News

News March 9, 2026

విశాఖ నుంచి మళ్లీ క్రూయిజ్ సేవలు

image

విశాఖ క్రూయిజ్ టెర్మినల్ నుంచి మళ్లీ క్రూయిజ్ సేవలు ప్రారంభం కానున్నాయి. కార్డిలియా క్రూయిజ్ షిప్ జూన్ 24న విశాఖకు చేరుకొని పుదుచ్చేరి మీదుగా చెన్నై వరకు ఐదు రోజుల సముద్ర విహార యాత్ర నిర్వహించనుంది. జులై 1, 8, 15 తేదీల్లో కూడా సేవలు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. నౌకలో ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు, థియేటర్, స్విమ్మింగ్ పూల్స్, వినోద కార్యక్రమాలు వంటి సౌకర్యాలు ఉంటాయి.

News March 9, 2026

విశాఖ: విద్యుత్ సమస్యలా.. ఈ నంబర్‌కు కాల్ చేయండి

image

ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని విద్యుత్ సంబంధిత సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో ప్రతి సోమవారం డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని సంస్థ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి నిర్వహిస్తున్నారు. విద్యుత్ వినియోగదారులు ఫోన్ నంబరు 8688400499 ద్వారా విద్యుత్ సంబంధిత సమస్యలను తెలియజేయవచ్చు. ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు డయల్ యువర్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

News March 8, 2026

విశాఖ ఏయూ అంబేడ్కర్ చైర్ ‘AgriAI’ పరికరం

image

విశాఖ ఏయూ అంబేద్కర్ చైర్ రూపొందించిన ‘AgriAI’ అనే వినూత్న పరికరాన్ని డైరెక్టర్ మనోజ్ తివారీ ప్రారంభించారు. ఇది IoT, AI సాంకేతికతతో పంటలను ఆశించే పురుగులను గుర్తించి, పంట స్థితిగతులను ఫొటోలతో సహా రైతులకు విశ్లేషిస్తుంది. LLM ఇంటిగ్రేషన్‌తో పనిచేసే ఈ పరికరం వ్యవసాయ క్షేత్రాల్లో విజయవంతంగా పరీక్షించబడింది, ఇది రైతులకు చీడపీడల నివారణలో ఎంతగానో తోడ్పడనుంది.