News January 22, 2025
రంజీ జెర్సీలో మెరిసిన హిట్ మ్యాన్
ముంబై తరఫున రంజీ మ్యాచ్‌లు ఆడేందుకు రోహిత్ సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ నెల 23 నుంచి జమ్మూకశ్మీర్‌తో జరగనున్న రంజీ మ్యాచ్‌లో బరిలోకి దిగనున్న హిట్‌మ్యాన్ ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోహిత్ రంజీ జెర్సీలో మెరిశారు. కొత్త జెర్సీలో ఫేవరెట్ క్రికెటర్‌ను చూసిన ఫ్యాన్స్ రంజీల్లోనూ అదరగొట్టాలని పోస్టులు పెడుతున్నారు. ముంబై జట్టుకు రహానే కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
Similar News
News January 22, 2025
సైఫ్‌పై కత్తి దాడి: పోలీసు శాఖ ట్విస్ట్
యాక్టర్ సైఫ్ అలీఖాన్‌పై కత్తిదాడి కేసులో మరో ట్విస్ట్. మొదటి నుంచి దర్యాప్తు చేస్తున్న పోలీస్ ఆఫీసర్ పీఐ సుదర్శన్ గైక్వాడ్‌ను ఈ కేసు నుంచి తప్పించారు. ఆయన స్థానంలో అజయ్ లింగ్‌నూర్కర్‌ను నియమించారు. అధికారిని ఎందుకు మార్చారో పోలీసు పెద్దలు చెప్పకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసులో చాలా మిస్సింగ్ లింక్స్ ఉన్నాయని, పురోగతేమీ కనిపించడం లేదని కొందరు పెదవి విరుస్తున్నారు.
News January 22, 2025
APలో వరల్డ్ ట్రేడ్ సెంటర్లను ఏర్పాటు చేయండి: లోకేశ్
దావోస్ పర్యటనలో భాగంగా వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ అసోసియేషన్ గ్లోబల్ ఛైర్ జాన్ డ్రూతో AP మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. విశాఖ, విజయవాడ, తిరుపతిలో WTCలను ఏర్పాటు చేయాలని కోరారు. ఆగ్నేయాసియా, మిడిల్ ఈస్ట్ ఆసియాతో భారత మార్కెట్‌ను అనుసంధానించడానికి వీలుగా ఏపీలో ట్రేడ్ హబ్‌ను ప్రారంభించాలన్నారు. అటు దేశంలో 13 WTC సెంటర్లు పనిచేస్తున్నాయని, 7 నిర్మాణంలో ఉన్నాయని, ఏపీలో ఏర్పాటును పరిశీలిస్తామని జాన్ చెప్పారు.
News January 22, 2025
ఫ్రీ హోల్డ్ రిజిస్ట్రేషన్లు మరో 2 నెలలు బంద్
AP: నిషిద్ధ జాబితా నుంచి తప్పించిన ఎసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లను మరో 2 నెలలు రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. అసైన్డ్ భూములకు గత ప్రభుత్వం యాజమాన్య హక్కులు కల్పించగా, పలు అక్రమాలు చోటు చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీంతో ఆగస్టు నుంచి ఈ భూముల రిజిస్ట్రేషన్లను నిలిపివేసిన ప్రభుత్వం, తాజాగా మరో 2 నెలలు పొడిగించింది. అక్రమాలపై పూర్తి సమాచారం పంపాలని కలెక్టర్లను ఆదేశించింది.