News March 18, 2024
గుజరాత్ టైటాన్స్‌లోకి సర్ఫరాజ్ ఖాన్?

టీమ్ ఇండియా నయా సెన్సేషన్ సర్ఫరాజ్ ఖాన్ ఐపీఎల్లో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గుజరాత్ టైటాన్స్ తరఫున ఆయన ఆడే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఆ జట్టు వికెట్ కీపర్ రాబిన్ మింజ్ బైక్ ప్రమాదంలో గాయపడి ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యారు. దీంతో అతడి స్థానంలో సర్ఫరాజ్‌ను తీసుకోవాలని గుజరాత్ భావిస్తున్నట్లు టాక్. కాగా ఐపీఎల్ మినీ వేలంలో సర్ఫరాజ్‌ను ఏ జట్టూ కొనుగోలు చేయలేదు.
Similar News
News March 31, 2025
కాంగ్రెస్ ప్రభుత్వంపై బండి ఫైర్

తెలంగాణలో హరిత విధ్వంసం చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. కాంగ్రెస్, BRS ఒక్కటేనని దుయ్యబట్టారు. గతంలో BRS హయాంలో కాళేశ్వరం నిర్మాణానికి 25 లక్షల చెట్లను తొలగించారన్నారు. ఇప్పుడు గచ్చిబౌలిలోని HCUలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకృతిని నాశనం చేస్తోందని ఫైరయ్యారు. అటవీ మాఫియాలో తెలంగాణ బందీ అయిందన్నారు. గొడ్డలి మారలేదని, పట్టిన చేతులు మారాయని విమర్శించారు.
News March 31, 2025
నా కొడుకు ఎవరినీ మోసం చేయలేదు: దర్శకుడి తల్లి ఆవేదన

‘L2:ఎంపురాన్’ మూవీలోని సన్నివేశాలు వివాదానికి దారి తీయడంపై దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తల్లి మల్లిక స్పందించారు. ఈ సినిమా విషయంలో పృథ్వీరాజ్‌ను అనవసరంగా నిందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కొడుకును బలిపశువును చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. పృథ్వీరాజ్ ఎవ్వరినీ మోసం చేయలేదని, చేయబోరని చెప్పారు. సినిమా స్క్రిప్ట్ విషయంలో తప్పులుంటే అందరి బాధ్యత ఉంటుందన్నారు.
News March 31, 2025
ఆదిలాబాద్ గిరిజన మహిళలకు PM ప్రశంస

TG: ఆదిలాబాద్ జిల్లా గిరిజన మహిళలను ప్రధాని మోదీ ప్రశంసించారు. వాళ్లు తయారు చేస్తున్న ఇప్పపువ్వు లడ్డూల గురించి మోదీ ‘మన్ కీ బాత్’లో ప్రస్తావించారు. మహిళలు కొత్త ప్రయోగం చేశారని అభినందించారు. కాగా అటవీ ప్రాంతాల్లో దొరికే ఇప్పపువ్వుతో గతంలో నాటుసారా తయారుచేసేవారు. అయితే ఉట్నూరుకు చెందిన కొందరు మహిళలు ఇప్పపువ్వుతో పోషక విలువలు కలిగిన లడ్డూలను తయారుచేస్తూ, గిరిజన పాఠశాలలకు పంపిణీ చేస్తున్నారు.