News March 18, 2024
గుజరాత్ టైటాన్స్‌లోకి సర్ఫరాజ్ ఖాన్?

టీమ్ ఇండియా నయా సెన్సేషన్ సర్ఫరాజ్ ఖాన్ ఐపీఎల్‌లో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గుజరాత్ టైటాన్స్ తరఫున ఆయన ఆడే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఆ జట్టు వికెట్ కీపర్ రాబిన్ మింజ్ బైక్ ప్రమాదంలో గాయపడి ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యారు. దీంతో అతడి స్థానంలో సర్ఫరాజ్‌ను తీసుకోవాలని గుజరాత్ భావిస్తున్నట్లు టాక్. కాగా ఐపీఎల్ మినీ వేలంలో సర్ఫరాజ్‌ను ఏ జట్టూ కొనుగోలు చేయలేదు.
Similar News
News November 14, 2025
బిహార్‌లో 2 చోట్ల MIM ఆధిక్యం

దేశమంతా ఆసక్తిగా చూస్తున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఎర్లీ ట్రెండ్స్ BJPకి అనుకూలంగా ఉన్నాయి. NDA 66 స్థానాల్లో లీడింగ్‌లో ఉండగా ఇందులో BJPవి 40, JDU 24 స్థానాలు. ఇక MGB 44 చోట్ల లీడ్ ప్రదర్శిస్తుండగా వీటిలో RJD-35, కాంగ్రెస్-7 ఉన్నాయి. ఇక ఏ కూటమిలో లేని AIMIM 2 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఆమౌర్‌లో 2020లో గెలిచిన ఆ పార్టీ అభ్యర్థి అక్తారుల్ ఇమాన్ ఈసారీ లీడ్‌లో ఉన్నారు.
News November 14, 2025
బిహార్ కౌంటింగ్ అప్‌డేట్

✦ NDA 49, MGB 39 స్థానాల్లో లీడింగ్
✦ రాఘోపూర్‌లో తేజస్వీ యాదవ్ లీడ్
✦ అలీనగర్‌లో మైథిలీ ఠాకూర్ (BJP) ముందంజ
✦ తారాపూర్‌లో డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి లీడ్
✦ మహువా నుంచి లాలూ కుమారుడు తేజ్ ప్రతాప్ ఆధిక్యం
✦ మోకామాలో అనంత్ సింగ్ (JDU) ముందంజ
News November 14, 2025
యాసంగి వరి సాగు.. ఆలస్యం వద్దు

TG: యాసంగిలో వరి నార్లు పోసుకోవడానికి డిసెంబర్ 20 వరకు అవకాశం ఉంది. నాట్లు ఆలస్యమైన కొద్దీ పంట దిగుబడులతో పాటు బియ్యం శాతం తగ్గి నూకశాతం పెరుగుతుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. యాసంగి సాగుకు జగిత్యాల రైస్-1, కూనారం సన్నాలు, R.S.R-29325, M.T.M-1010, తెల్లహంస, సన్నగింజ రకాలైన తెలంగాణ సోన, K.N.M-1638, K.N.M-733, W.G.L-962, జగిత్యాల సాంబ J.G.L-27356, R.N.R-21278 రకాలు అనుకూలం.


