News January 22, 2025
అమెరికా నుంచి 18000 మంది వెనక్కి!

డొనాల్డ్ ట్రంప్ పాలసీలకు తగినట్టు భారత్ ప్రణాళికలు వేసుకుంటోంది. USతో అనవసరంగా ట్రేడ్‌వార్ తెచ్చుకోకుండా ఉండేందుకు 18,000 అక్రమ వలసదారులను వెనక్కి తీసుకొచ్చేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. 2 దేశాలూ కలిసి వీరిని గుర్తించాయి. స్టూడెంట్, వర్క్ వీసాలతో లీగల్‌గా అక్కడికి వెళ్లినవారికి అడ్డంకులు రావొద్దనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. లేదంటే వీసాలు, గ్రీన్‌కార్డులు తగ్గించి ట్రంప్ తిప్పలు పెట్టొచ్చు.
Similar News
News January 30, 2026
TG EAPCET షెడ్యూల్ విడుదల

తెలంగాణ ఈఏపీ సెట్-2026(గతంలో ఎంసెట్) షెడ్యూల్ వచ్చేసింది. ఫిబ్రవరి 14న నోటిఫికేషన్ విడుదల కానుంది. అదేనెల 19 నుంచి ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 4,5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు, మే 9 నుంచి జూన్ 11 వరకు ఇంజినీరింగ్ ఎగ్జామ్స్ జరగనున్నాయి.
News January 30, 2026
‘ఓం శాంతి శాంతి శాంతిః’ రివ్యూ& రేటింగ్

కన్నవాళ్లు విధించిన కట్టుబాట్లు, భర్త(తరుణ్ భాస్కర్) చూపించే పురాషాహంకారాన్ని ఎదిరించి ప్రశాంతి(ఈషా రెబ్బ) జీవితంలో ఎలా నిలదొక్కుకుంది అనేదే కథ. తరుణ్, ఈషా నటన మెప్పిస్తుంది. కొన్ని సీన్లు ఆలోచింపజేస్తాయి. సెకండాఫ్‌లో డైరెక్టర్ AR సజీవ్ తడబడినట్లు అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే, కామెడీ సీన్లు ఒరిజినల్ మలయాళ చిత్రం ‘జయ జయ జయ జయహే’ తరహాలో వర్కౌట్ కాలేదన్న భావన కలుగుతుంది.
రేటింగ్: 2.25/5
News January 30, 2026
కారు ఇంటి వద్ద ఉన్నా టోల్.. ఇదే కారణం!

దేశవ్యాప్తంగా FASTag వ్యవస్థలో లోపాలు గుర్తించినట్లు LSలో ఓ ప్రశ్నకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సమాధానం ఇచ్చారు. ‘2025లో 17.7లక్షల వాహనాలకు తప్పుగా టోల్ వసూలైంది. ఇంటి వద్ద ఉన్న కార్లకూ ఛార్జీ పడినట్లు మెసేజ్‌లు వెళ్లాయి. టోల్ ప్లాజాల్లో ఆటోమేటిక్ సిస్టమ్ పనిచేయనప్పుడు మాన్యువల్ ఎంట్రీ కారణంగా ఈ తప్పిదాలు జరిగాయి. 17.7లక్షల కేసులకు సంబంధించి NHAI టోల్ డబ్బులు తిరిగి చెల్లించింది’ అని వివరించారు.


