News January 22, 2025
గిలియన్ బార్ సిండ్రోమ్ లక్షణాలు ఇవే!

కాళ్లు, చేతులు, ఇతర శరీర భాగాల్లో నొప్పి, తిమ్మిరి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జ్వరం, దగ్గు, జలుబు, కడుపు నొప్పి గిలియన్ బార్ సిండ్రోమ్ లక్షణాలు. బాధితులకు ఇంట్రావీనస్ ఇమ్యునోగ్లోబులిన్స్ (IVIG) ఇంజెక్షన్లు లేదా ప్లాస్మా మార్పిడితో చికిత్స అందిస్తారని డాక్టర్లు తెలిపారు. వ్యాధి సోకిన వెంటనే చికిత్స అందిస్తే బాధితులు పూర్తిగా కోలుకుంటారని, ఆందోళన అవసరం లేదని చెబుతున్నారు.
Similar News
News April 18, 2026
మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడం BJP ఓటమే: సీఎం రేవంత్

TG: మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడం BJP ఓటమి అని, విపక్షాల ఐక్యతతో కేంద్రం ఓడిందని CM రేవంత్ అన్నారు. ‘NDA నిజాయతీగా బిల్లు తీసుకురాలేదు. 3 బిల్లుల పేరుతో డీలిమిటేషన్ అమలుకు కుట్ర చేసింది. 2023 మహిళా బిల్లును యథాతథంగా అమలు చేస్తే మద్దతిస్తాం. మహిళా రిజర్వేషన్లలోనూ SC, ST, OBC కోటాలు ఉండాలి’ అని ప్రెస్‌మీట్‌లో చెప్పారు. BJPకి 400సీట్లు వస్తే కచ్చితంగా రాజ్యాంగాన్ని మార్చేస్తుందన్నారు.
News April 18, 2026
ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ పెంపు

కేంద్రప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మోదీ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. 2 శాతం డీఏ (కరవు భత్యం) పెంచుతూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. చివరిసారిగా గతేడాది అక్టోబర్‌లో డీఏ పెంచింది.
News April 18, 2026
బిల్లుపై కేంద్రం Vs ప్రతిపక్షాలు.. మీ అభిప్రాయమేంటి?

131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై ప్రజల మధ్య ఆసక్తికర చర్చ జరుగుతోంది. మహిళలకు మంచి చేయాలనుకున్న కేంద్రం.. పాత రిజర్వేషన్ బిల్లునే పెట్టాల్సిందని, దానికి డీలిమిటేషన్‌ను లింక్ చేయడం ఎందుకని కొందరు ప్రశ్నిస్తున్నారు. డీలిమిటేషన్ వల్ల అన్ని రాష్ట్రాలకు సమన్యాయం జరుగుతుందని, ప్రతిపక్షాలకు మహిళల పట్ల గౌరవం లేకనే ఉమెన్ బిల్లును వ్యతిరేకించాయని మరికొందరు అంటున్నారు. బిల్లుపై మీ ఒపీనియన్?


