News January 22, 2025
గిలియన్ బార్ సిండ్రోమ్ లక్షణాలు ఇవే!

కాళ్లు, చేతులు, ఇతర శరీర భాగాల్లో నొప్పి, తిమ్మిరి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జ్వరం, దగ్గు, జలుబు, కడుపు నొప్పి గిలియన్ బార్ సిండ్రోమ్ లక్షణాలు. బాధితులకు ఇంట్రావీనస్ ఇమ్యునోగ్లోబులిన్స్ (IVIG) ఇంజెక్షన్లు లేదా ప్లాస్మా మార్పిడితో చికిత్స అందిస్తారని డాక్టర్లు తెలిపారు. వ్యాధి సోకిన వెంటనే చికిత్స అందిస్తే బాధితులు పూర్తిగా కోలుకుంటారని, ఆందోళన అవసరం లేదని చెబుతున్నారు.
Similar News
News February 11, 2025
మంచి మాట – పద్యబాట

నిండు నదులు పాఱు నిల్చి గంభీరమై
వెర్రివాగు పాఱు వేగబొర్లి
అల్పుడాడు రీతి నధికుండు నాడునా
విశ్వదాభిరామ వినురవేమ.
భావం: గొప్ప నదులు నిదానంగా, గంభీరంగా ప్రవహిస్తాయి. పిల్లవాగులు అతివేగంగా గట్లుదాటి పొర్లి ప్రవహిస్తాయి. అట్లే యోగ్యుడు నిదానంగా, గంభీరంగా మాట్లాడతాడు. నీచుడు బడ బడ వాగుతూ ఉంటాడు.
News February 11, 2025
జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల

జేఈఈ మెయిన్ 2025 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. https://jeemain.nta.nic.in/ వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకోవచ్చు. అయితే వెబ్‌సైట్‌లో ఎర్రర్ వస్తోందని, రిజల్ట్స్ చూపించడం లేదని పలువురు అభ్యర్థులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం గత నెల 22 నుంచి 29 వరకు ఈ పరీక్షను నిర్వహించారు. ఫైనల్ ఆన్సర్ కీ కోసం ఇక్కడ <
News February 11, 2025
AP కాస్ట్ సర్టిఫికెట్లు తెలంగాణలో చెల్లవు: హైకోర్టు

ఏపీ ప్రభుత్వం జారీ చేసే ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలతో తెలంగాణలో రిజర్వేషన్లు పొందలేరని TG హైకోర్టు స్పష్టం చేసింది. పీజీ మెడికల్ సీట్లలో రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లను విచారించింది. TG ప్రభుత్వం జారీ చేసిన SC సర్టిఫికెట్ ఉన్న వాళ్లే ఇక్కడ రిజర్వేషన్‌కు అర్హులని తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం AP SC కాస్ట్ సర్టిఫికెట్ పత్రం TGలో చెల్లదన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనలతో CJ ధర్మాసనం ఏకీభవించింది.