News January 23, 2025
రూ.173కు కొని.. రూ.43 కోట్లకు అమ్మాడు!
ఇంట్లో పాత వస్తువులుంటే మనం చెత్తబుట్టలో పడేస్తాం. కానీ, అమెరికాకు చెందిన ఓ వ్యక్తి ఆ పాత వస్తువు అమ్మి కోటీశ్వరుడయ్యాడు. పాత వస్తువులను కలెక్ట్ చేసే అలవాటున్న ఓ వ్యక్తి 2010లో ఓ షాపుకెళ్లి $2 (రూ. 173) చెల్లించి పాత ఫొటోను కొన్నాడు. అయితే, ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి అమెరికన్ చరిత్రలో చాలా ప్రసిద్ధి చెందినవారని తెలుసుకున్నాడు. ఈక్రమంలో 2014లో దీనిని వేలం వేసి $5 మిలియన్లకు(రూ.43కోట్లు) విక్రయించాడు.
Similar News
News January 23, 2025
వారికి ఖాన్స్ కావాలి.. హిందూ నటులను పట్టించుకోరు: BJP నేత
బంగ్లాదేశీయుడు నిజంగానే సైఫ్‌ను కత్తితో పొడిచాడా లేక ఆయన యాక్ట్ చేస్తున్నారా అని MH మంత్రి నితేశ్ రాణె ప్రశ్నించారు. పరిస్థితుల్ని గమనిస్తే డౌట్ వస్తోందన్నారు. ‘చూస్తుంటే షరీఫుల్‌ను సైఫ్ స్వయంగా స్వాగతించినట్టు అనిపిస్తోంది. ఇక ప్రతిపక్షాలకేమో ఖాన్ యాక్టర్స్ తప్ప హిందూ నటులపై జాలి ఉండదు. సుశాంత్ గురించి సుప్రియా, జితేందర్ ఎప్పుడైనా అడిగారా? సైఫ్, షారుఖ్ కొడుకునైతే పట్టించుకుంటారు’ అని అన్నారు.
News January 23, 2025
సరస్వతీ పవర్ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు
AP: మాజీ సీఎం YS జగన్‌కు రాష్ట్ర ప్రభుత్వం షాకిచ్చింది. ఆయనకు చెందిన సరస్వతీ పవర్, ఇండస్ట్రీస్ కోసం పల్నాడు జిల్లాలో కొనుగోలు చేసిన భూముల్లోని ప్రభుత్వ, అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లను రద్దు చేసింది. మాచవరం(మ) వేమవరంలో 20 ఎకరాలు, పిన్నెల్లిలో 4.84 ఎకరాల దస్తావేజులను రద్దు చేస్తున్నట్లు తహశీల్దార్ ప్రకటించారు. డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అధికారులు భూముల్లో సర్వే చేసి GOVT భూములను గుర్తించారు.
News January 23, 2025
పొద్దున చలి.. మధ్యాహ్నం ఎండ
TG: రాష్ట్రంలో పొద్దున, రాత్రి చలి వణికిస్తుండగా మధ్యాహ్నం ఎండ దంచుతోంది. ఉదయం 9 గంటలైనా పొగమంచుతో కూడిన చలి ఉంటోంది. సాయంత్రం 6 అయితే చాలు ఉష్ణోగ్రతలు పడిపోయి గజగజ మొదలవుతోంది. చాలా జిల్లాల్లో 10 డిగ్రీలలోపు టెంపరేచర్ నమోదవుతోంది. ఇక మధ్యాహ్నం ఎండ సుర్రుమంటోంది. 30 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి. ఈ భిన్న వాతావరణంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.