News March 18, 2024

రేపు కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల ప్రకటన!

image

TG: లోక్‌సభ అభ్యర్థుల పూర్తి జాబితాను కాంగ్రెస్ పార్టీ రేపు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. నిన్న రాత్రి ముంబైలో ఆ పార్టీ స్క్రీనింగ్ కమిటీ భేటీ జరిగింది. ఈ సమావేశంలో కమిటీ ఛైర్మన్ హరీశ్ చౌదరి, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొని లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. కాగా, రాష్ట్రంలో 17 స్థానాలకు గాను ఇప్పటికే 4 స్థానాలకు ఏఐసీసీ అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే.

Similar News

News September 4, 2025

AP క్యాబినెట్ మరిన్ని నిర్ణయాలు

image

క్యాబినెట్ నిర్ణయాలను మంత్రి పార్థసారథి వివరించారు.
* 2025 ఆగస్టు 31 వరకు ఉన్న అనధికార కట్టడాల క్రమబద్ధీకరణకు నిర్ణయం
* చిత్తూరు జిల్లాలో 2 పరిశ్రమల ఏర్పాటుకు సమ్మతం
* మడకశిరలో HFCL కంపెనీ ఏర్పాటుకు ఆమోదం
* విశాఖ, అమరావతి, మంత్రాలయంలో స్టార్ హోటళ్ల ఏర్పాటుకు పచ్చజెండా
* పట్టణాల్లో 2సెంట్లు, గ్రామాల్లో 3సెంట్ల ఇంటి స్థలం ఇచ్చే ప్రతిపాదనకు ఆమోదం

News September 4, 2025

అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు

image

కేంద్ర మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దైంది. ఉప రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఆయన తన పర్యటన రద్దు చేసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ నెల 6న హైదరాబాద్‌లో జరిగే గణేశ్ శోభాయాత్రలో ఆయన పాల్గొనాల్సి ఉండగా, పర్యటన రద్దైంది.

News September 4, 2025

వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని ముందుకు తీసుకెళ్దాం: మోదీ

image

దేశ ఉత్పత్తుల వినియోగంతో దేశ రూపురేఖలు మారుతాయని PM మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. స్వదేశీ వస్తు వినియోగం, మేడిన్ ఇండియాను విద్యార్థి దశలోనే నేర్పాలని ఉపాధ్యాయులకు సూచించారు. ‘వోకల్ ఫర్ లోకల్ నినాదం మరింత ముందుకు తీసుకెళ్లాలి. దేశీయ ఉత్పత్తులు వాడుతున్నామని అందరూ గర్వపడాలి. గాంధీజీ నినాదం కూడా స్వదేశీ.. దాన్ని అందరం పాటించాలి. స్వదేశీ డే, స్వదేశీ వీక్‌ను పండుగగా నిర్వహించుకోవాలి’ అని పిలుపునిచ్చారు.