News March 18, 2024
రేపు కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల ప్రకటన!
TG: లోక్‌సభ అభ్యర్థుల పూర్తి జాబితాను కాంగ్రెస్ పార్టీ రేపు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. నిన్న రాత్రి ముంబైలో ఆ పార్టీ స్క్రీనింగ్ కమిటీ భేటీ జరిగింది. ఈ సమావేశంలో కమిటీ ఛైర్మన్ హరీశ్ చౌదరి, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొని లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. కాగా, రాష్ట్రంలో 17 స్థానాలకు గాను ఇప్పటికే 4 స్థానాలకు ఏఐసీసీ అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే.
Similar News
News December 1, 2024
ALERT.. కాసేపట్లో వర్షం
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రానున్న 3 గంటల్లో మోస్తరు వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, ఖమ్మం, మేడ్చల్ మల్కాజ్‌గిరి, నాగర్‌కర్నూల్, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, భువనగిరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌లో చిరుజల్లులు కురిసిన సంగతి తెలిసిందే.
News December 1, 2024
రూ.10 కోసం పోలీసులకు ఫిర్యాదు!
రూ.10 బాకీ పడిన మనిషి ఆ మొత్తాన్ని ఇవ్వడం లేదని ఓ వ్యక్తి పోలీసుల్ని ఆశ్రయించిన ఆసక్తికర ఘటన ఇది. UPలోని హర్దోయ్ ప్రాంతానికి చెందిన జితేంద్ర పాన్ షాప్ నడుపుకుంటున్నారు. సంజయ్ అనే కస్టమర్ ఏడాదిన్నర క్రితం గుట్కా ప్యాకెట్ కొని రూ.10 అరువు పెట్టాడు. ఎన్నిసార్లు అడిగినా ఇవ్వడం లేదని విసిగిపోయిన జితేంద్ర, పోలీస్ హెల్ప్‌లైన్ 112కి ఫోన్ చేశారు. పోలీసులు వచ్చి సంజయ్ నుంచి రూ.10ని జితేంద్రకి ఇప్పించారు.
News December 1, 2024
ఇది మహారాష్ట్రకు అవమానకరం: ఆదిత్య ఠాక్రే
ఎన్నికల ఫలితాలు వెలువడి వారం గడుస్తున్నా ప్రభుత్వం ఏర్పాటు కాకపోవడం మహారాష్ట్రకు అవమానకరమని శివసేన UBT నేత ఆదిత్య ఠాక్రే విమర్శించారు. అసెంబ్లీ గడువు ముగిసినా రాష్ట్రపతి పాలన ఎందుకు విధించడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన బలాన్ని క్లైం చేసుకోకుండానే ప్రమాణస్వీకారానికి తేదీ ప్రకటించడం అరాచకమని మండిపడ్డారు. వర్లీ నుంచి ఆదిత్య గెలిచిన విషయం తెలిసిందే.