News January 23, 2025
ఈ క్రికెటర్‌తో మాట్లాడాలంటే కుర్చీ వేసుకోవాల్సిందే..

SA20 లీగ్ సందర్భంగా సౌతాఫ్రికా పేసర్ మార్కో జాన్సన్‌ను ఇంటర్వ్యూ చేసేందుకు కామెంటేటర్లు కుర్చీ వేసుకోవాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మార్కో హైట్ 6.9 అడుగులు. జట్టులో మిగతా సభ్యులంతా మార్కో ముందు చిన్నపిల్లల్లా కనిపిస్తారు. గతంలో సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా, మార్కో పక్కపక్కన ఉన్న ఫొటో కూడా వైరల్ అయిన విషయం తెలిసిందే.
Similar News
News March 14, 2025
సీతానగరం: ‘ఎలిఫెంట్ జోన్ మా కొద్దు’

నివాస ప్రాంతాల సమీపంలో ఎలిఫెంట్ జోన్ మా కొద్దని సీపీఎం నాయకులు కొల్లు గంగు నాయుడు డిమాండ్ చేశారు. సీతానగరం మండలంలో ఎలిఫెంట్ జోన్ పెట్టడం అంటే ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారు. ఎక్కడ నుంచి వచ్చిన ఏనుగులను అక్కడికి తరలించకుండా జనావాసాల మధ్య పెట్టడం సరైన విధానం కాదని అన్నారు. ప్రస్తుతం చేస్తున్న ఎలిఫెంట్ జోన్ పనులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
News March 14, 2025
IPL-2025లో కెప్టెన్లు

*చెన్నై- రుతురాజ్ గైక్వాడ్
*ఆర్సీబీ- రజత్ పాటీదార్
*పంజాబ్- శ్రేయస్ అయ్యర్
*ముంబై- హార్దిక్ పాండ్య
*లక్నో- రిషభ్ పంత్
*గుజరాత్- గిల్
*రాజస్థాన్- సంజూ శాంసన్
*కేకేఆర్- అజింక్యా రహానే *SRH- కమిన్స్
*ఢిల్లీ- అక్షర్ పటేల్
News March 14, 2025
వచ్చే నెల 15న అమరావతికి ప్రధాని మోదీ

AP: ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన ఖరారైంది. రాజధాని పున:ప్రారంభ పనులకు ఏప్రిల్ 15న ఆయన హాజరుకానున్నారు. రూ.లక్ష కోట్ల అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం చుట్టేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున రాజధాని పనులు ప్రారంభించి మూడేళ్లలో ముగించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.