News January 23, 2025
ఈ క్రికెటర్‌తో మాట్లాడాలంటే కుర్చీ వేసుకోవాల్సిందే..

SA20 లీగ్ సందర్భంగా సౌతాఫ్రికా పేసర్ మార్కో జాన్సన్‌ను ఇంటర్వ్యూ చేసేందుకు కామెంటేటర్లు కుర్చీ వేసుకోవాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మార్కో హైట్ 6.9 అడుగులు. జట్టులో మిగతా సభ్యులంతా మార్కో ముందు చిన్నపిల్లల్లా కనిపిస్తారు. గతంలో సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా, మార్కో పక్కపక్కన ఉన్న ఫొటో కూడా వైరల్ అయిన విషయం తెలిసిందే.
Similar News
News February 8, 2025
BJPకి షాక్: మెజార్టీ నంబర్ వైపు AAP

ఢిల్లీలో ఓట్ల లెక్కింపు సాగే కొద్దీ పార్టీల ఆధిక్యాలు మారుతున్నాయి. అరగంట క్రితం 50 స్థానాల్లో దూకుడు ప్రదర్శించిన బీజేపీ ప్రస్తుతం 41కి తగ్గిపోయింది. ఇక ఆమ్‌ఆద్మీ పార్టీ 18 నుంచి 28కి పుంజుకుంది. చాలాచోట్ల అభ్యర్థుల ఆధిక్యాలు 500 నుంచి 1000 మధ్యే ఉంటున్నాయి. దీంతో ప్రతి రౌండ్ ముగిసే సరికి నంబర్లు అటూ ఇటూ మారుతున్నాయి. మెజారిటీని నిర్ణయించడంలో ముస్లిం ఆధిపత్య నియోజకవర్గాలు కీలకం కానున్నాయి.
News February 8, 2025
ఆధిక్యంలోకి వచ్చిన కేజ్రీవాల్, సిసోడియా

న్యూఢిల్లీ స్థానంలో ఆప్ అధినేత కేజ్రీవాల్(254+), జంగ్‌పురాలో మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా(1800+) తొలిసారి ఆధిక్యంలోకి వచ్చారు. కౌంటింగ్ మొదలైన దాదాపు రెండు గంటల తర్వాత ఆప్ అగ్రనేతలు లీడింగ్‌లోకి వచ్చారు. మరోవైపు కల్కాజీ స్థానంలో సీఎం ఆతిశీ, షాకూర్ బస్తీలో సత్యేంద్ర జైన్ వెనుకంజలో కొనసాగుతున్నారు.
News February 8, 2025
రామ్ చరణ్-బుచ్చిబాబు సినిమా కథ ఇదేనా?

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కోడి రామ్మూర్తి జీవిత కథ ఆధారంగా తీస్తున్నారని తొలుత ప్రచారం నడిచింది. అయితే సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తాజాగా కథ గురించి హింట్ ఇచ్చారు. ‘రాత్రుళ్లు షూటింగ్, ఫ్లడ్ లైట్లు, పవర్ క్రికెట్, విచిత్రమైన కోణాలు’ అని ట్వీట్ చేశారు. దీంతో రెండు ఊళ్ల మధ్య జరిగే క్రికెట్ ఆధారంగా మూవీ కథ ఉంటుందని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.