News March 18, 2024
పల్నాడు: 2 బైకులు ఢీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు
ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ముగ్గురికి తీవ్రగాయాలైన ఘటన బెల్లంకొండ గ్రామ శివారులో ఆదివారం చోటుచేసుకుంది. 108 సిబ్బంది వివరాల మేరకు.. న్యూ చిట్యాల నుంచి వస్తున్న బైక్, బెల్లంకొండ నుంచి చిట్యాల వైపు వెళ్తున్న బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ బైక్ పై ఉన్న మమత, గుణశేఖర్‌ల తలకు తీవ్ర గాయాలయ్యాయి. మురళీకృష్ణ స్వల్పంగా గాయపడ్డాడు. క్షతగాత్రులను సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు.
Similar News
News December 21, 2024
ముచ్చటైన ముగ్గులకు ఆహ్వానం!
ధనుర్మాసం ప్రారంభమైంది. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో మహిళలు ఉదయాన్నే ఇంటి వాకిటను శుభ్రం చేసి ముగ్గులు వేస్తారు. న్యూ ఇయర్, సంక్రాంతి వరకు రంగురంగుల రంగవళ్లులను తీర్చిదిద్దుతుంటారు. మరి మీ అందమైన ముగ్గులను మాకు పంపండి. మీ పేరుతో Way2Newsలో మేము పబ్లిష్ చేస్తాం.
● ఇలా పంపండి: ముగ్గు ఫొటో, మీ పేరు, ఊరి పేరు, పాస్‌పోర్టు సైజు ఫొటోను 97036 22022కు వాట్సాప్ చేయండి.
News December 21, 2024
బాలయేసు కేథడ్రల్ చరిత్ర మీకు తెలుసా.?
ఫిరంగిపురంలోని బాలయేసు కేథడ్రల్ ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద చర్చి. ఈ చర్చి నిర్మాణానికి దశాబ్దాలుగా కృషిచేసిన ఫాదర్ థియోడర్ డిక్మన్ 1891లో పూర్తిచేశారు. జులై, క్రిస్మస్లో ఇక్కడ జరిగే ఉత్సవాలు ప్రసిద్ధం. జులై 14,15,16 DEC 23,24,25 తేదీల్లో ఇక్కడ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. 24రాత్రి గుంటూరు బిషప్ చర్చిలో దివ్య బలిపూజా నిర్వహిస్తారు. కాగా ఈ బలి పూజను గుంటూరు జిల్లా నుంచే ప్రారంభమవుతుంది.
News December 21, 2024
తెనాలి: ఇస్రో ప్రయోగంతో అంతరిక్షంలోకి ఎన్ స్పెస్ టెక్ కమ్యూనికేషన్
తెనాలికి చెందిన రక్షణ ఎయిరోస్పేస్ సంస్థ ఎన్–స్పేస్‌టెక్ రూపొందించిన తొలి యూహెచ్ఎఫ్ కమ్యూనికేషన్ పేలోడ్‌ను ఇస్రోకు చెందిన పీఎస్ఎల్వీ–సీ60 మిషన్‌లో ప్రయోగించనున్నారు. స్వదేశీ సామర్థ్యంతో, ఉపగ్రహ కమ్యూనికేషన్లో వినూత్నతను ప్రతిబింబించే స్వేచ్ఛాశాట్–వీఓ మిషన్ పేరుతో చేపడుతున్న ఈప్రయోగం చివరి వారంలో ఇస్రో పొయెం-4 ప్లాట్‌ఫాం ద్వారా జరుగుతుందని ఎన్–స్పేస్‌టెక్ సీఈవో దివ్య కొత్తమాసు తెలిపారు.