News January 23, 2025

పవన్‌తో సెల్ఫీ తీసుకున్న సింగపూర్ హైకమిషనర్

image

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో సింగపూర్ హైకమిషనర్ సైమన్ వాంగ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనతో సెల్ఫీ దిగి ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ‘విజయవాడలో పవన్ కళ్యాణ్ గారు ఆత్మీయంగా స్వాగతించినందుకు ధన్యవాదాలు. సింగపూర్- ఆంధ్రప్రదేశ్ చిరకాల స్నేహాన్ని కలిగి ఉన్నాయి. AP-SG సహకారాన్ని బలోపేతం చేయడంపై జరిగిన చర్చను అభినందించాల్సిందే’ అని ట్వీట్ చేశారు.

Similar News

News January 26, 2026

పంతం నెగ్గించుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

image

మునుగోడు నియోజకవర్గంలో మద్యం నియంత్రణపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి తన మార్కు నిర్ణయాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాతే దుకాణాలు తెరవాలని, సాయంత్రం 6 గంటలకే పర్మిట్‌ రూమ్‌లు మూసివేయాలన్న ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలవుతున్నాయి. తొలుత నిబంధనలు అతిక్రమించేందుకు యజమానులు ప్రయత్నించినప్పటికీ, పోలీసుల ‘డ్రింక్‌&డ్రైవ్‌’ తనిఖీలతో విక్రయదారులు దారికి వచ్చారు.

News January 26, 2026

నేటి ముఖ్యాంశాలు

image

* 131 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం
* అంతరిక్ష యాత్ర పూర్తిచేసిన శుభాంశు శుక్లాకు అశోక చక్ర
* అమరావతికి చట్టబద్ధతే లక్ష్యం.. ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం
* TG: సింగరేణి టెండర్ల రద్దుపై విచారణకు సిద్ధం: కోమటిరెడ్డి
* నాంపల్లి అగ్నిప్రమాదంలో ఐదుగురు మృతి.. రూ.5 లక్షల చొప్పున పరిహారం
* సింగ‌రేణిలో మిగిలిన స్కామ్‌లను బయటపెడతాం: హరీశ్ రావు
* న్యూజిలాండ్‌పై మూడో T20Iలో భారత్ విజయం

News January 26, 2026

T20Iల్లో టీమ్ ఇండియా ఫాస్టెస్ట్ ఫిఫ్టీ

image

న్యూజిలాండ్‌తో మూడో టీ20లో భారత బ్యాటర్లు దూకుడుగా ఆడిన సంగతి తెలిసిందే. 154 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమ్ ఇండియా స్కోరు 19(3.1 ఓవర్లు) బంతుల్లోనే 50 దాటింది. T20Iల్లో భారత్‌కు ఇదే అత్యంత వేగమైన 50 కావడం విశేషం. 2023లో బంగ్లాదేశ్‌పై టీమ్ ఇండియా 22(3.4 ఓవర్లు) బంతుల్లో ఫిఫ్టీ స్కోర్ చేసింది. 2021లో స్కాట్లాండ్‌పై, 2022లో ఆస్ట్రేలియాపై 3.5 ఓవర్లలో 50 స్కోర్ చేసింది.