News January 23, 2025

పాపడాలు అమ్మి రోజుకు రూ.10వేలు సంపాదన

image

పొట్టకూటి కోసం పాపడాలమ్మే చక్రధర్ రాణా రోజుకు రూ.10వేలు సంపాదిస్తున్నారని తెలిసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో ఉడాలా వీధుల్లో ఈయన 50 ఏళ్లుగా పాపడాలు అమ్ముతున్నారు. రోజూ 30-40 కిలోమీటర్లు నడిచి స్థానిక మార్కెట్‌లో విక్రయిస్తుంటారు. ఒక్కటి రూ.10 చొప్పున రోజూ వెయ్యి పీసులు అమ్మి రూ.10వేలు సంపాదిస్తున్నారు. తొలినాళ్లలో ఒక్కోటి 5 పైసలకు అమ్మేవారు.

Similar News

News January 30, 2026

గుడ్‌న్యూస్.. త్వరలో టీమ్‌లోకి తిలక్ వర్మ?

image

T20 WCకు ముందు టీమ్ ఇండియాకు భారీ ఊరట లభించనుంది. గాయంతో NZ సిరీస్‌కు దూరమైన స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ త్వరలో జట్టులో చేరనున్నట్లు BCCI వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం CoEలో ట్రైనింగ్‌లో ఉన్న ఆయన ఫిట్ అని తేలితే ఫిబ్రవరి 3న టీమ్‌లో చేరతారు. సిమ్యులేషన్ మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం ఉంది. ఫిబ్రవరి 7న WC ప్రారంభం కానుండటంతో వర్మ చేరిక కలిసొస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

News January 30, 2026

‘పుర’ సేవలు మరింత సులభం

image

AP: పౌరసేవలను మెరుగుపర్చేలా మున్సిపల్ శాఖ 123 మున్సిపాలిటీలను అనుసంధానిస్తూ ఇంటిగ్రేటెడ్ డ్యాష్ బోర్డు, వెబ్‌సైట్లను రూపొందించింది. పురమిత్ర అనే AI-ఆధారిత వర్చువల్ అసిస్టెంట్‌ను వీటికి ఇంటిగ్రేట్ చేసింది. పౌరులు మొబైల్‌ నంబరు నమోదుతో అవ‌స‌ర‌మైన స‌ర్వీస్‌లు అందుకోవచ్చు. అసెస్‌మెంట్‌ నంబర్ లింకుతో ఫిర్యాదులు, ఆస్తి ఇతర వివరాలు పొందవచ్చు. నీటి సరఫరా, శానిటేషన్‌పై అధికారులు నిత్యం పర్యవేక్షిస్తారు.

News January 30, 2026

7,948 పోస్టులు.. సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు వచ్చేశాయ్..

image

నిరుద్యోగ అభ్యర్థులకు అలర్ట్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 7,948 <>MTS<<>>, హవల్దార్ పరీక్షలకు సంబంధించి సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను విడుదల చేసింది. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి పరీక్ష ఏ నగరంలో ఉంటుందో తెలుసుకోవచ్చు. ఫిబ్రవరి 4 నుంచి 15 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.