News January 23, 2025

పాపడాలు అమ్మి రోజుకు రూ.10వేలు సంపాదన

image

పొట్టకూటి కోసం పాపడాలమ్మే చక్రధర్ రాణా రోజుకు రూ.10వేలు సంపాదిస్తున్నారని తెలిసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో ఉడాలా వీధుల్లో ఈయన 50 ఏళ్లుగా పాపడాలు అమ్ముతున్నారు. రోజూ 30-40 కిలోమీటర్లు నడిచి స్థానిక మార్కెట్‌లో విక్రయిస్తుంటారు. ఒక్కటి రూ.10 చొప్పున రోజూ వెయ్యి పీసులు అమ్మి రూ.10వేలు సంపాదిస్తున్నారు. తొలినాళ్లలో ఒక్కోటి 5 పైసలకు అమ్మేవారు.

Similar News

News February 16, 2025

మస్తాన్ సాయి కేసు.. గవర్నర్‌కు లావణ్య లాయర్ లేఖ

image

AP: <<15471142>>మస్తాన్‌సాయి<<>> కేసు వ్యవహారం మరో మలుపు తిరిగింది. గుంటూరు మస్తాన్ దర్గా ధర్మకర్తలుగా మస్తాన్ సాయి కుటుంబాన్ని తొలగించాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు లావణ్య తరఫు లాయర్ లేఖ రాశారు. అతని నేరాల వల్ల దర్గా పవిత్రతకు భంగం వాటిల్లుతుందని పేర్కొన్నారు. అలాగే సీఎస్, గుంటూరు కలెక్టర్, మైనార్టీ సంక్షేమ కార్యదర్శికి కూడా లేఖలు రాశారు.

News February 16, 2025

సీఎం రేవంత్‌కు సబ్జెక్ట్ లేదు: ఎంపీ అర్వింద్

image

TS: హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఎంపీ అర్వింద్ విమర్శించారు. ప్రపంచ దేశాలు మోదీని గౌరవిస్తుంటే, ఆయన కులంపై సీఎం విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు. రేవంత్‌కు సబ్జెక్ట్ లేదని, అడ్మినిస్ట్రేషన్‌లోనూ ఆయన విఫలమయ్యారన్నారు. కులగణనలో కోటి మంది ప్రజల లెక్క తెలియలేదని దుయ్యబట్టారు.

News February 16, 2025

ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

image

క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ షెడ్యూల్ ఇవాళ సాయంత్రం రానుంది. సా.5.30 గంటలకు జియో హాట్ స్టార్‌, స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ 18లో ప్రత్యక్ష ప్రసారం కానున్నట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి.

error: Content is protected !!