News January 24, 2025
విద్యుత్ సమస్యల పరిష్కారానికి 1912: భట్టి

TG: వేసవిలో పీక్ డిమాండ్ దృష్ట్యా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. ప్రజా భవన్‌లో ఎన్పీడీసీఎల్, ట్రాన్స్‌కో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. 108 తరహాలో విద్యుత్ సరఫరాలో సమస్యలపై ఫిర్యాదుకు 1912ను విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఈ వ్యవస్థ నిర్వహణకు ప్రభుత్వం అదనపు నిధులు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు.
Similar News
News October 29, 2025
రెడ్ అలర్ట్‌లో ఆ జిల్లాలు: మంత్రి లోకేశ్

AP: తుఫాను వల్ల రాష్ట్రంలో సుమారు 40 లక్షల మంది ప్రజలు ప్రభావితమవుతున్నారని మంత్రి లోకేశ్ తెలిపారు. ‘కాకినాడ, కోనసీమ, ప.గో., కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలను అత్యధిక తీవ్రత కలిగిన ప్రాంతాలుగా గుర్తించాం. అవి రెడ్ అలర్ట్‌లో ఉన్నాయి. ఎలాంటి ప్రాణ నష్టం ఉండకూడదనేదే మా లక్ష్యం’ అని ట్వీట్ చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు ఈ రాత్రికి ఆయన RTGS కేంద్రంలోనే బస చేయనున్నారు.
News October 29, 2025
టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు

◆ బ్రహ్మోత్సవాల్లో పనిచేసిన పర్మినెంట్ ఉద్యోగులకు ₹15,400, కాంట్రాక్ట్/అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ₹7,535 చొప్పున బహుమానం.. తిరుమల, తిరుపతి సిబ్బందికి అదనంగా 10%
◆ గోశాలల నిర్వహణకు నిపుణుల కమిటీ ఏర్పాటు.. నివేదిక ఆధారంగా సంస్కరణలు
◆ కొనుగోలు విభాగంలో అవకతవకలపై ACBతో విచారణ
◆ కాణిపాకం ఆలయం వద్ద ₹25Crతో యాత్రికుల వసతి సముదాయం, వివాహ హాల్స్ నిర్మాణానికి ఆమోదం
News October 29, 2025
సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించనున్న రజినీ?

రజినీకాంత్, కమల్ హాసన్ కాంబోలో ఓ మల్టీస్టారర్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. 2027లో షూటింగ్ ప్రారంభవుతుందని, రజినీకి ఇదే చివరి సినిమా అని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్టు తర్వాత రిటైర్ కావాలని ఆయన డిసైడయ్యారట. కాగా ఆయన ప్రస్తుతం నెల్సన్ దర్శకత్వంలో ‘జైలర్-2’ చేస్తున్నారు. ఆ తర్వాత సి.సుందర్‌తో ఓ మూవీ చేస్తారని టాక్ వినిపిస్తోంది. రజినీ-కమల్ మూవీని నెల్సన్ తెరకెక్కిస్తారని సమాచారం.


