News January 24, 2025
RAILWAY: మూడు జెనరేషన్స్ ఒకే చోట

భారతీయ రైల్వేలో కీలక మార్పులు జరుగుతున్నాయి. వేగంతో పాటు ఫస్ట్ క్లాస్ వసతులతో రైళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం వందేభారత్ ట్రైన్లను తీసుకురాగా త్వరలోనే బుల్లెట్ రైళ్లు సైతం వచ్చే అవకాశం ఉంది. అయితే, మూడు జెనరేషన్ల రైళ్లు ఒకే చోట ఉన్న ఫొటో వైరలవుతోంది. డీజిల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ ఇంజిన్‌తో పాటు వందేభారత్ రైళ్లు ఒకే ఫ్రేమ్‌లో కనిపించాయి. మీరు ఈ మూడింట్లోనూ ప్రయాణించారా? COMMENT
Similar News
News January 5, 2026
ఒంటరితనం ఒక స్లో పాయిజన్!

‘ఒంటరి వాడిని నేను..’ అంటూ గర్వంగా చెబుతున్నారా? అయితే ఇది మీకోసమే. ఇలా ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా జీవించేవారికి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రావచ్చొని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ఒంటరిగా ఉంటే రోగనిరోధక శక్తి తగ్గి ఇన్ఫెక్షన్లు త్వరగా సోకుతాయి. ముఖ్యంగా ఒత్తిడి హార్మోన్లు పెరిగి వైరస్‌లతో పోరాడే సామర్థ్యం తగ్గిపోతుంది. ఇది గుండె సంబంధిత వ్యాధులకు & దీర్ఘకాలిక వాపులకు దారితీస్తుంది. SHARE IT
News January 5, 2026
20% నిల్వలున్నా.. 1% ఉత్పత్తే: వెనిజులాకు ఎందుకీ దుస్థితి?

ప్రపంచ చమురు నిల్వల్లో 20% వాటా ఉన్న వెనిజులా ప్రస్తుతం కేవలం 1% (10 లక్షల బ్యారెళ్లు) మాత్రమే ఉత్పత్తి చేస్తోంది. 1990ల్లో 35 లక్షలుగా ఉన్న ఈ ఉత్పత్తి.. స్కిల్డ్ వర్కర్ల తొలగింపు, కంపెనీల జాతీయీకరణ, అవినీతి, నిధుల మళ్లింపు, అమెరికా ఆంక్షల వల్ల ఘోరంగా పడిపోయింది. ఇప్పుడు మదురోను బంధించిన ట్రంప్.. US కంపెనీల పెట్టుబడులతో ఈ భారీ నిల్వలను వెలికితీసి ప్రపంచ చమురు మార్కెట్‌ను శాసించాలని స్కెచ్ వేశారు.
News January 5, 2026
గేదెలు, ఆవుల్లో ఈ తేడాను గమనించారా?

గేదెల కంటే ఆవులకే తెలివితేటలు ఎక్కువట. ఒక గేదెను 10 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి వదిలేస్తే ఇంటికి తిరిగి రాలేదు. దాని జ్ఞాపక శక్తి గోవుతో పోలిస్తే చాలా తక్కువ. అదే ఆవును 10km దూరం తీసుకెళ్లి వదిలేసినా ఇంటిదారి మర్చిపోకుండా తిరిగి వచ్చేస్తుందట. 10 గేదెలను కట్టి వాటి పిల్లలను విడిచిపెడితే ఒక్కపిల్ల కూడా దాని తల్లిని గుర్తించలేదు. ఆవు దూడలు అలాకాదట, తనతల్లి కొన్ని వందల ఆవుల మధ్యలో ఉన్నా గుర్తిస్తాయట.


