News January 24, 2025
RAILWAY: మూడు జెనరేషన్స్ ఒకే చోట

భారతీయ రైల్వేలో కీలక మార్పులు జరుగుతున్నాయి. వేగంతో పాటు ఫస్ట్ క్లాస్ వసతులతో రైళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం వందేభారత్ ట్రైన్లను తీసుకురాగా త్వరలోనే బుల్లెట్ రైళ్లు సైతం వచ్చే అవకాశం ఉంది. అయితే, మూడు జెనరేషన్ల రైళ్లు ఒకే చోట ఉన్న ఫొటో వైరలవుతోంది. డీజిల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ ఇంజిన్‌తో పాటు వందేభారత్ రైళ్లు ఒకే ఫ్రేమ్‌లో కనిపించాయి. మీరు ఈ మూడింట్లోనూ ప్రయాణించారా? COMMENT
Similar News
News February 17, 2025
Stock Markets: హమ్మయ్య.. నష్టాలకు తెర!

ఎట్టకేలకు నష్టాలకు తెరపడింది. స్టాక్‌మార్కెట్లు నేడు లాభపడ్డాయి. ఉదయం 180 Pts పతనమైన నిఫ్టీ 22,959 (+30), 600 pts కోల్పోయిన సెన్సెక్స్ 75,996 (+57) వద్ద ముగిశాయి. ఫార్మా, హెల్త్‌కేర్, బ్యాంకు, ఫైనాన్స్, మెటల్ షేర్లు ఇందుకు దన్నుగా నిలిచాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్ టాప్ గెయినర్స్. M&M, ఎయిర్‌టెల్, ఇన్ఫీ, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంకు టాప్ లూజర్స్.
News February 17, 2025
రేపు అమెరికా, రష్యా ప్రతినిధుల భేటీ

రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి తెరదించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్నారు. ఈమేరకు రేపు సౌదీఅరేబియాలో అమెరికా, రష్యా ప్రతినిధులు భేటీ కానున్నారు. యుద్ధం ముగింపుతో పాటు ఇరు దేశాల సంబంధాలపైనా చర్చించనున్నారు. మరోవైపు బైడెన్ హయాంలో ఉక్రెయిన్‌కు US నుంచి సాయం అందగా ట్రంప్ అధికారంలోకి రాగానే నిలిచిపోయింది. దీంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఈయూ దేశాల సాయం కోరుతున్నారు.
News February 17, 2025
బండి సంజయ్‌కి ఆ దమ్ముందా?: మహేశ్ కుమార్

TG: BCలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో బిల్లును ప్రవేశపెడతామని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. ప్రధాని మోదీని ఒప్పించి ఆ బిల్లును 9వ షెడ్యూల్‌లో పెట్టించే దమ్ము బండి సంజయ్‌కు ఉందా? అని సవాల్ విసిరారు. అలాగే దేశ వ్యాప్తంగా కులగణన చేయాలని ఆయన ప్రధానిని అడగగలరా? అని నిలదీశారు. బీసీల్లో ఐక్యత లోపించిందని, వారంతా ఏకతాటిపైకి రావాలని మహేశ్ పిలుపునిచ్చారు.