News January 24, 2025

జియో యూజర్లకు కొత్త ప్లాన్లు

image

యూజర్ల కోసం రిలయన్స్ జియో కొత్త ప్లాన్లను తీసుకొచ్చింది. ఇంటర్నెట్ లేకుండా వాయిస్, SMS ప్లాన్లను ప్రవేశపెట్టింది. 84 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చిన రూ.458 ప్లాన్‌లో అపరిమిత కాల్స్, వెయ్యి SMSలు పంపుకోవచ్చు. రూ.1958 ప్లాన్‌లో 365 రోజుల పాటు అపరిమిత కాల్స్, 3600 SMSలు పంపుకోవచ్చు. డేటా అవసరం లేని వారి కోసం ప్లాన్లు తీసుకురావాలని TRAI టెలికం సంస్థలను ఆదేశించింది.

Similar News

News January 17, 2026

మేడారం మహాజాతర.. ప్రధాన ఘట్టాలు!

image

TG: మేడారం మహాజాతర మరో 11 రోజుల్లో ప్రారంభం కానుంది. ముఖ్య కార్యక్రమాల వివరాలు ఇలా..
* ఈ నెల 28(బుధవారం) సాయంత్రం 4 గంటలకు సారలమ్మ గద్దెకు వచ్చే సమయం
* 29(గురువారం) సాయంత్రం 5 గంటలకు సమ్మక్క గద్దెకు వచ్చే సమయం
* 30(శుక్రవారం) అమ్మవార్లకు మొక్కులు చెల్లించుట
* 31(శనివారం) సాయంత్రం 4 గంటలకు సమ్మక్క-సారలమ్మ వనప్రవేశం
** ఈ నెల 19న సీఎం రేవంత్ గద్దెల పునరుద్ధరణ ప్రారంభోత్సవం చేస్తారు.

News January 17, 2026

మోదీ అండతో మనం మరింత ముందుకెళ్లాలి: CM

image

దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే వచ్చాయని CM చంద్రబాబు తెలిపారు. ‘ఏపీకి ఉన్న అన్ని రకాల వనరులు ఉపయోగించుకుంటున్నాం. ఇటీవల రూ.8.75 లక్షల కోట్ల పెట్టుబడులకు అనుమతి ఇచ్చాం. గ్రీన్ హైడ్రోజన్, క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీ కండక్టర్ మిషన్, డేటా సెంటర్లు, రోబోటిక్స్ వస్తున్నాయి. నాలెడ్జ్ ఎకానమీలో ముందున్న వారే విజేతలు అవుతారు. PM మోదీ అండతో మనం మరింత ముందుకెళ్లాలి’ అని కాకినాడలో సూచించారు.

News January 17, 2026

H1B వీసాలు.. డాక్టర్లే ఎక్కువగా సంపాదిస్తున్నారట!

image

అమెరికాలో H1B వీసాలతో టెకీల కంటే మెడికల్ స్పెషలిస్టులే ఎక్కువగా సంపాదిస్తున్నారని ఓ అధ్యయనంలో తేలింది. కొందరు స్పెషలిస్టుల (రేడియాలజిస్టులు, కార్డియాలజిస్టులు, సర్జన్లు, న్యూరాలజిస్టులు) జీతాలు 3 లక్షల డాలర్ల కంటే ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. డాక్టర్ల తర్వాత లాయర్లు, కంప్యూటర్ సిస్టమ్ మేనేజర్లు, ఫైనాన్స్ మేనేజర్లు లక్ష-2 లక్షల డాలర్లు సంపాదిస్తున్నారని తెలిపింది.