News January 24, 2025
జియో యూజర్లకు కొత్త ప్లాన్లు

యూజర్ల కోసం రిలయన్స్ జియో కొత్త ప్లాన్లను తీసుకొచ్చింది. ఇంటర్నెట్ లేకుండా వాయిస్, SMS ప్లాన్లను ప్రవేశపెట్టింది. 84 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చిన రూ.458 ప్లాన్‌లో అపరిమిత కాల్స్, వెయ్యి SMSలు పంపుకోవచ్చు. రూ.1958 ప్లాన్‌లో 365 రోజుల పాటు అపరిమిత కాల్స్, 3600 SMSలు పంపుకోవచ్చు. డేటా అవసరం లేని వారి కోసం ప్లాన్లు తీసుకురావాలని TRAI టెలికం సంస్థలను ఆదేశించింది.
Similar News
News February 18, 2025
సిగ్గు సిగ్గు.. సీఎంకు ఇంత అభద్రతా భావమా?: KTR

TG: తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన KCR పుట్టినరోజున విద్యార్థులకు స్వీట్లు పంచడం తప్పా అని KTR ప్రశ్నించారు. పుట్టిన రోజు వేడుకలు చేస్తే సరూర్ నగర్ స్కూల్ HMను సస్పెండ్ చేస్తారా అని ఫైరయ్యారు. వార్డు మెంబర్ కాని రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డికి కలెక్టర్ సలాం కొట్టడం, పోలీసులు ఎస్కార్ట్ ఇవ్వొచ్చా అని నిలదీశారు. సిగ్గు సిగ్గు.. CMకు ఇంత అభద్రతా భావమా అని దుయ్యబట్టారు.
News February 18, 2025
మార్చి 28నే ‘హరిహర వీరమల్లు’: నిర్మాత

పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిస్తోన్న ‘హరిహర వీరమల్లు’ మూవీని మార్చి 28నే రిలీజ్ చేస్తామని నిర్మాత ఏఎం రత్నం ప్రకటించారు. ఆ దిశగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. పవన్‌కు సంబంధించిన మిగిలిన షూటింగ్ కూడా త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు. ఈ చిత్రం నుంచి ఈ నెల 24న రొమాంటిక్ సాంగ్ రిలీజ్ కానుంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
News February 18, 2025
ప్రజాస్వామ్యంపై జగన్ లెక్చర్ ఇవ్వడం వింతగా ఉంది: లోకేశ్

AP: అధికారం ఉన్నప్పుడు చట్టాలను తుంగలో తొక్కి… ఇప్పుడు ప్రజాస్వామ్యం, పద్ధతులు అంటూ జగన్ లెక్చర్ ఇవ్వడం వింతగా ఉందని మంత్రి లోకేశ్ అన్నారు. 100 మందికి పైగా వైసీపీ రౌడీలు టీడీపీ కార్యాలయంపై దాడి చేయడం కోట్లాది మంది కళ్లారా చూశారని చెప్పారు. పచ్చి అబద్ధాలను కాన్ఫిడెంట్‌గా చెప్పడంలో జగన్ PhD చేసినట్టు ఉన్నారని ఎద్దేవా చేశారు. కక్ష సాధింపు, కుట్రలు, కుతంత్రాలు జగన్ బ్రాండ్ అని ఫైరయ్యారు.