News March 18, 2024

420లు 400 సీట్లు గెలుస్తామంటున్నారు: ప్రకాశ్‌రాజ్

image

సినీ నటుడు ప్రకాశ్ రాజ్ బీజేపీ నేతలపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ‘420(మోసాలు) పనులు చేసిన వాళ్లు వచ్చే ఎన్నికల్లో 400 సీట్లలో గెలుపుపై మాట్లాడుతున్నారు. వారు ఏ పార్టీ అయినా కావొచ్చు. ఇది వారి అహంకారానికి నిదర్శనం. ఒక పార్టీ 400 సీట్లలో గెలవడం సాధ్యం కాదు’ అని స్పష్టం చేశారు. కాగా తాము సింగిల్‌గా 370 సీట్లు, NDA కూటమికి 400 సీట్లు వస్తాయని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే.

Similar News

News December 22, 2024

ఉండి: ఆ ఇద్దరూ దొరికితే వీడనున్న చిక్కుముడి

image

ఉండి మండలం యండగండిలో తులసి అనే మహిళ ఇంటికి డెడ్‌బాడీ పార్శిల్ ఘటన రాష్ట్రంలో సంచలనం రేపింది. ఆ మృతదేహం ఎవరిది? ఎందుకు పార్శిల్ చేశారనేది ఉత్కంఠగా మారింది. కాగా తులసి మరిది సిద్ధార్థ వర్మే నిందితుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే తులిసి, ఆమె చెల్లికి ఉన్న ఆస్తి తగాదాలే ఇందుకు కారణమనే ప్రచారం సాగుతోంది. ఆటోలో మృతదేహాన్ని పార్శిల్‌కు అప్పగించిన మహిళ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

News December 22, 2024

పుణ్యక్షేత్రాల్లో పెరిగిన రద్దీ

image

వారాంతం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పుణ్యక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తిరుమలలో శ్రీనివాసుడి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 14 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 72,411మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా హుండీకి రూ.3.44 కోట్ల ఆదాయం సమకూరింది. అటు యాదాద్రిలోనూ భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం కావడంతో భారీ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

News December 22, 2024

భారత్‌ను బలవంతం చేయలేరు: జైశంకర్

image

భారత్ ఎప్పుడైనా స్వప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే నిర్ణయం తీసుకుంటుందని విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ తేల్చిచెప్పారు. నిర్ణయాల్ని మార్చుకునేలా తమను వేరే దేశాలు ప్రభావితం చేయలేవని స్పష్టం చేశారు. ‘స్వతంత్రంగా ఉండేందుకు, మధ్యస్థంగా ఉండటానికి మధ్య వ్యత్యాసం ఉంది. మాకెప్పుడూ భారత ప్రయోజనాలు, ప్రపంచ శాంతే ముఖ్యం. అందుకు అవసరమైన నిర్ణయాలే తీసుకుంటాం. భారతీయతను కోల్పోకుండా ఎదుగుతాం’ అని వివరించారు.