News January 25, 2025

రైతు భరోసా.. వాళ్లకు గుడ్‌న్యూస్!

image

TG: రేపటి నుంచి రైతు భరోసా అమలుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం కొత్తగా పాస్‌బుక్‌లు పొందినవారికి గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 1వ తేదీ వరకు కొత్తగా భూమి రిజిస్ట్రేషన్ అయిన వారి కోసం రైతుభరోసా సైట్‌‌లో ప్రత్యేక ఆప్షన్ ఇచ్చారు. వారంతా తమ పాస్‌బుక్, ఆధార్, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఏఈవోలకు ఇస్తే వాటిని అప్‌లోడ్ చేసేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గతంలో రైతుబంధు రాని వారు కూడా ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు.

Similar News

News January 27, 2025

దేశంలోనే తొలిసారి.. బిచ్చం అడిగినందుకు అరెస్ట్

image

దేశంలో ఎన్నడూ లేని విధంగా.. భిక్షాటన చేసినందుకు ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. భోపాల్‌లోని ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద బిచ్చమెత్తుకుంటున్న యాచకుడిని స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ పౌరుడు చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి అరెస్టు చేశామని అధికారులు తెలిపారు. ఆ రాష్ట్రం ఇటీవలే <<15081465>>భిక్షాటన నిరోధక చట్టాన్ని<<>> తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై మీరేమంటారు? కామెంట్ చేయండి.

News January 27, 2025

పరిధి దాటేసిన ఏఐ.. మరింత ప్రమాదం?

image

AI ఉపయోగాలు కోకొల్లలు. కానీ దాని వల్ల వాటిల్లే ఉపద్రవాల గురించే ఆందోళన ఎక్కువగా ఉంది. దానిని నిజం చేసేలా AI మోడల్ తాజాగా తనను తానే క్లోనింగ్ చేసుకుంది. అలీబాబా, మెటా సంస్థలకు చెందిన రెండు లాంగ్వేజ్ మోడల్స్‌ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ‘మోడల్ షట్‌డౌన్ కాకుండా ఉండేందుకు అపరిమిత క్లోనింగ్ చేసుకోగలుగుతోంది. అవసరమైతే వ్యవస్థను రీస్టార్ట్ చేస్తోంది. ఇది చాలా ప్రమాదకరం’ అని పరిశోధకులు హెచ్చరించారు.

News January 27, 2025

ఇంటిపై నుంచి బాలికను తోసేసి చంపిన కోతి

image

ఇంటి డాబాపై చదువుతున్న పదో తరగతి బాలికను కోతులు భయపెట్టి కిందకు తోసేసిన ఘటన బిహార్‌లోని సివాన్‌లో జరిగింది. విద్యార్థిని ప్రియ డాబాపై చదువుకుంటుండగా కోతుల గుంపు దాడి చేసింది. భయంతో ఆమె బిల్డింగ్ అంచులకు వెళ్లగా ఓ కోతి కిందకి తోసేసింది. తీవ్రంగా గాయపడ్డ ప్రియను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. తెలుగు రాష్ట్రాల్లోనూ కోతుల బెడద విపరీతంగా ఉంది.