News March 18, 2024
హనుమకొండ: దాడి చేసిన 9మందిపై కేసు

హనుమకొండ జిల్లా శాయంపేటకు చెందిన నాగరాజు, గణపురం గ్రామానికి చెందిన శ్రావణి ప్రేమించి ఈ నెల 12న పెళ్లి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న అమ్మాయి బంధువులు 14న శాయంపేటకు పోలీసులను సంప్రదించగా కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఈక్రమంలో 16న బంధువులు నాగరాజు ఇంటికి వెళ్లి దాడి చేశారు. దీంతో శ్రావణి ఫిర్యాదు చేయగా దాడి చేసిన తొమ్మిది మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
Similar News
News February 6, 2026
ఎన్నికల విధుల నిర్వహణలో అలసత్వం వద్దు: కలెక్టర్

మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ప్రిసైడింగ్ అధికారులు (పీఓలు), సహాయ ప్రిసైడింగ్ అధికారులు (ఏపీఓలు) కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ సత్య శారద పిలుపునిచ్చారు. ఎన్నికల శిక్షణ తరగతుల్లో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య ప్రక్రియలో పోలింగ్ నిర్వహణ అత్యంత ప్రధానమైనదని, అధికారులు నిబంధనల ప్రకారం నడుచుకోవాలని సూచించారు. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విధులు నిర్వర్తించి ఎన్నికలను విజయవంతం చేయాలన్నారు.
News February 6, 2026
చిన్న పొరపాటు లేకుండా ఎన్నికలను నిర్వహించాలి: కలెక్టర్

మున్సిపల్ ఎన్నికల్లో చిన్న పొరపాటు లేకుండా అధికారులు సమర్థవంతంగా పని చేయాలని కలెక్టర్ సత్యశారద సూచించారు. నర్సంపేటలోని జడ్పీ సెకండరీ స్కూల్‌లో పీవోలు, ఏపీవోలకు శుక్రవారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికల నిర్వహణలో ప్రతి అధికారి బాధ్యతతో విధులు నిర్వర్తించాలన్నారు. అనంతరం ఎన్నికల సామగ్రిని, పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని పరిశీలించారు. పలు సూచనలు చేశారు.
News February 2, 2026
వరంగల్: ఎంపిక ప్రక్రియపై దిశానిర్దేశం

మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌ల ఎంపిక ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, ఎన్నికల కమిషన్ జారీ చేసిన నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్, ఎన్నికల అధికారి డా.సత్య శారదతో మాట్లాడారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులు పాల్గొన్నారు.


