News March 18, 2024
హనుమకొండ: దాడి చేసిన 9మందిపై కేసు
హనుమకొండ జిల్లా శాయంపేటకు చెందిన నాగరాజు, గణపురం గ్రామానికి చెందిన శ్రావణి ప్రేమించి ఈ నెల 12న పెళ్లి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న అమ్మాయి బంధువులు 14న శాయంపేటకు పోలీసులను సంప్రదించగా కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఈక్రమంలో 16న బంధువులు నాగరాజు ఇంటికి వెళ్లి దాడి చేశారు. దీంతో శ్రావణి ఫిర్యాదు చేయగా దాడి చేసిన తొమ్మిది మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
Similar News
News October 13, 2024
MHBD: గన్‌తో కాల్చుకొని AR కానిస్టేబుల్ మృతి
మహబూబాబాద్ కలెక్టరేట్ లో ఆదివారం దారుణం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కలెక్టరేట్‌లో విధులు నిర్వహిస్తున్న AR కానిస్టేబుల్ శ్రీనివాస్ గన్‌తో కాల్చుకొని మృతి చెందారని తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News October 13, 2024
వరంగల్: రేపటి నుంచి ఎనుమాముల మార్కెట్ START
4 రోజుల వరుస సెలవులు అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ రేపు (సోమవారం) పునఃప్రారంభం కానుంది. ఈనెల 10న దుర్గాష్టమి, 11న మహార్ణవమి, 12న విజయదశమి, వారంతపు యార్డు బంద్, 13న ఆదివారం సాధారణ సెలవు నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉంది. దీంతో మార్కెట్ రేపు ప్రారంభం కానుండగా, ఉదయం 6 గంటల నుంచే క్రయవిక్రయాలు ప్రారంభం కానున్నాయి.
News October 13, 2024
టేకుమట్ల: చలివాగులో స్నానానికి వెళ్లి ఇద్దరు మృతి
భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని రాఘవరెడ్డిపేట -టేకుమట్ల చలివాగులో స్నానానికి వెళ్లిన ఇద్దరు ఆదివారం మృతిచెందారు. మండలంలోని వెల్లంపల్లికి చెందిన సొల్లేటి రాములు(45) గ్రామపంచాయతీ సిబ్బంది, గీస హరీశ్ (25) ఉదయం 10 గంటలకు చలివాగులో స్నానానికి వెళ్లారు. ప్రమాదశావత్తు అందులో మునిగిపోయి మృతిచెందారు. పండుగ తెల్లవారే మరణించడంతో గ్రామంలో తీవ్రవిషాదం నెలకొంది.