News January 25, 2025

విజయసాయి రాజీనామాపై స్పందించిన సీఎం

image

AP: విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంపై మీడియా సమావేశంలో ఎదురైన ప్రశ్నకు సీఎం చంద్రబాబు స్పందించారు. అది వైసీపీ అంతర్గత వ్యవహారమని చెప్పారు. నాయకుడిపై నమ్మకం ఉంటే నేతలు ఉంటారని, లేదంటే ఎవరి మార్గం వాళ్లు చూసుకుంటారని పేర్కొన్నారు. అటు రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ తన రాజీనామా లేఖను ఆమోదించారని విజయసాయి చెప్పారు.

Similar News

News November 6, 2025

TG SETకు దరఖాస్తు చేశారా?

image

అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ లెక్చరర్‌షిప్‌కు అర్హత సాధించే <>TG SE<<>>T-2025 దరఖాస్తు చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. దరఖాస్తులో తప్పుల సవరణ నవంబర్ 26 నుంచి 28 వరకు చేసుకోవచ్చు. డిసెంబర్ 3న వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంచుతారు. డిసెంబర్ రెండో వారంలో పరీక్ష నిర్వహిస్తారు. వెబ్‌సైట్: http://telanganaset.org/

News November 6, 2025

పెరిగిన బంగారం, వెండి ధరలు

image

గత రెండు రోజులుగా తగ్గిన బంగారం ధరలు ఇవాళ పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రా. గోల్డ్ రూ.430 పెరిగి రూ.1,21,910కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రా. పసిడి రూ.400 పెరిగి రూ.1,11,750 పలుకుతోంది. అటు కేజీ వెండి రేటు రూ.1,000 పెరిగి రూ.1,64,000గా ఉంది.

News November 6, 2025

‘SIR’ను వ్యతిరేకించిన మమతకూ ఫామ్ ఇచ్చిన BLO

image

SIRకు వ్యతిరేకంగా 2 రోజుల కిందట బెంగాల్ CM మమతా బెనర్జీ <<18197344>>ర్యాలీ<<>> నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాతి రోజే ఓటర్ లిస్ట్ ఎన్యుమరేషన్ ఫామ్‌ను ఆమె అందుకున్నారు. కోల్‌కతాలోని CM నివాసానికి నిన్న బూత్ లెవల్ ఆఫీసర్ వెళ్లారు. ఫామ్‌ను నేరుగా మమతకే ఇస్తానని సెక్యూరిటీ సిబ్బందికి BLO చెప్పినట్లు సమాచారం. దీంతో స్వయంగా మమత వచ్చి తీసుకున్నారని తెలుస్తోంది. దాన్ని నింపిన తర్వాత BLOకు ఇవ్వనున్నారు.