News January 25, 2025

విజయసాయి రాజీనామాపై స్పందించిన సీఎం

image

AP: విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంపై మీడియా సమావేశంలో ఎదురైన ప్రశ్నకు సీఎం చంద్రబాబు స్పందించారు. అది వైసీపీ అంతర్గత వ్యవహారమని చెప్పారు. నాయకుడిపై నమ్మకం ఉంటే నేతలు ఉంటారని, లేదంటే ఎవరి మార్గం వాళ్లు చూసుకుంటారని పేర్కొన్నారు. అటు రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ తన రాజీనామా లేఖను ఆమోదించారని విజయసాయి చెప్పారు.

Similar News

News February 17, 2025

IPL.. ఈ జట్లకు కెప్టెన్లు ఎవరు?

image

IPL-2025 మార్చి 22న ప్రారంభం కానుంది. ఇటీవలి వేలంలో పలువురు ప్లేయర్లు, కెప్టెన్లు ఆయా ఫ్రాంచైజీలను వీడారు. RCB తమ కెప్టెన్‌గా రజత్ పాటీదార్‌ను ప్రకటించింది. కోల్‌కతా నైట్‌రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఇంకా తమ కెప్టెన్లను ప్రకటించలేదు. KKRలో రహానే, వెంకటేశ్ అయ్యర్, నరైన్, రింకూ.. DCలో KL రాహుల్, అక్షర్ పటేల్, డుప్లిసెస్ కెప్టెన్సీ రేసులో ఉన్నారు. వీరిలో కెప్టెన్సీ ఎవరికి దక్కుతుందో కామెంట్ చేయండి.

News February 17, 2025

ఢిల్లీలో తొక్కిసలాట.. రైల్వేశాఖ అప్రమత్తం

image

ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళాకు భారీగా భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో రద్దీ నియంత్రణకు రైల్వేశాఖ చర్యలు చేపట్టింది. న్యూఢిల్లీతో పాటు ప్రయాగ్‌రాజ్, వారణాసి, అయోధ్య, కాన్పూర్, లక్నో, మిర్జాపూర్ రైల్వే స్టేషన్లలో GRP, RPF పోలీసులను భారీగా మోహరించారు. స్టేషన్ బయటే ప్రయాణికుల రద్దీని నియంత్రిస్తున్నారు. వాహనాలను స్టేషన్ల సమీపంలోకి అనుమతించడంలేదు. రైలు వచ్చాక ప్లాట్‌ఫాంపైకి ప్రయాణికులను అనుమతిస్తున్నారు.

News February 17, 2025

RECORD: 84 ఏళ్ల కాపురం.. 100+ గ్రాండ్ చిల్డ్రన్

image

దాంపత్యంలో చిన్న విభేదాలకే విడిపోతున్న ఈ రోజుల్లో 84ఏళ్ల తమ కాపురంతో రికార్డు సృష్టించిన ఓ జంట అందరికీ స్ఫూర్తినిస్తోంది. బ్రెజిల్‌కు చెందిన మనోయిల్(105), మరియా(101)కు 1940లో పెళ్లయ్యింది. వీరు 13మంది పిల్లలు, 55మంది మనవళ్లు, మనవరాళ్లు, 54మంది గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్, 12మంది గ్రేట్ గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్స్‌ను చూశారు. ఒకరిపై ఒకరికి గల ప్రేమ, నమ్మకం వల్లే అన్యోన్యంగా ఉంటున్నామని చెబుతున్నారు.

error: Content is protected !!