News January 25, 2025
శ్రీజేశ్‌కు పద్మభూషణ్.. అశ్విన్‌కు పద్మశ్రీ

క్రీడా విభాగంలో పలువురు ప్లేయర్లకు పద్మ అవార్డులు వరించాయి. హాకీ మాజీ గోల్ కీపర్ శ్రీజేశ్‌కు కేంద్రం పద్మభూషణ్ పురస్కారం ప్రకటించింది. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత స్పిన్నర్ అశ్విన్‌కు, హర్వీందర్ సింగ్(పారా అథ్లెట్-హరియాణా), మణి విజయన్(ఫుట్ బాల్-కేరళ), సత్యపాల్ సింగ్(కోచ్- యూపీ) పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు.
Similar News
News October 19, 2025
దీపావళికి తాబేలును ఎందుకు కొంటారు?

దీపావళి సందర్భంగా తాబేలును ఇంటికి తీసుకురావడం శుభప్రదంగా భావిస్తారు. తాబేలు అనేది విష్ణుమూర్తి కూర్మావతారానికి ప్రతీక. అందుకే అనేక ఆలయ కోనేట్లలో తాబేళ్లను వదులుతారు. దీపావళి రోజున దీన్ని ఇంటికి తేవడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. దీర్ఘాయుష్షుకు సంకేతమైన ఇది ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఫలితంగా కుటుంబం సుఖ సంతోషాలతో వెలుగొందుతుందని భావిస్తారు.
News October 19, 2025
శుభ్‌మన్ గిల్ చెత్త రికార్డు

అన్ని ఫార్మాట్లలో (టెస్ట్, వన్డే, టీ20) కెప్టెన్సీ చేసిన తొలి మ్యాచులోనే ఓటమి చవిచూసిన కెప్టెన్ల జాబితాలో శుభ్‌మన్ గిల్ చేరారు. భారత్ నుంచి ఈ లిస్టులో అతనితో పాటు కోహ్లీ ఉన్నారు. గిల్ గత ఏడాది జింబాబ్వే చేతిలో టీ20 మ్యాచ్ ఓడగా, ఈ ఏడాది టెస్ట్ (vsENG), ODI(vsAUS)లో పరాజయం పాలయ్యారు. కాగా ఈ ఏడాది వన్డేల్లో టీమ్ ఇండియాకు ఇదే తొలి ఓటమి. వరుసగా 8 విజయాలు సాధించిన తర్వాత ఇవాళ AUSతో మ్యాచులో ఓడింది.
News October 19, 2025
రాష్ట్రం ప్రగతితో ప్రకాశించాలి: సీఎం చంద్రబాబు

AP: చీకట్లను పారద్రోలి వెలుగుల్ని తీసుకువచ్చే పండుగ దీపావళి అని CM CBN అన్నారు. రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ‘లోకాన్ని పీడిస్తున్న నరకాసురుడిని శ్రీ కృష్ణ, సత్యభామ కలిసి వధించిన రోజు ఇది. ఈ దీపావళి ప్రజల జీవితాల్లో మరిన్ని వెలుగులు తీసుకురావాలి. రాష్ట్రం ప్రగతితో ప్రకాశించాలి’ అని ట్వీట్ చేశారు. అటు దీపావళి తెలుగువారి జీవితాల్లో వేల కాంతులు నింపాలని YS జగన్ ఆకాంక్షించారు.