News January 26, 2025

‘దావోస్’ ట్రెండ్ సెట్ చేసింది నేనే: చంద్రబాబు

image

AP: మన దేశం నుంచి పెట్టుబడుల కోసం దావోస్‌కు వెళ్లాలనే ట్రెండ్ సెట్ చేసింది తానేనని సీఎం చంద్రబాబు అన్నారు. 1997 నుంచే తాను దావోస్ పర్యటనలకు వెళ్తున్నానని చెప్పారు. ‘90వ దశకంలో ఇంటర్నెట్ విప్లవం మొదలైంది. అప్పటి నుంచి నేను పెట్టుబడుల కోసం దావోస్‌కు వెళ్తుండేవాడిని. నాతోపాటు అప్పటి కర్ణాటక సీఎం ఎస్ఎం కృష్ణ నాతో పోటీపడేవారు. ఏపీని గేట్ వే ఆఫ్ ఇండియాగా మార్చడమే నా లక్ష్యం’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News January 13, 2026

సంక్రాంతి: ఈ పరిహారాలు పాటిస్తే బాధలు దూరం

image

పుష్య మాసం, మకర రాశి శని దేవుడికి ప్రీతిపాత్రమైనవి. సంక్రాంతి రోజున శని అనుగ్రహం కోసం నువ్వుల నలుగుతో స్నానం చేయాలి. దారిద్ర్యం పోవాలంటే శివలింగానికి నెయ్యితో అభిషేకం చేయాలి. పితృదేవతలకు తర్పణాలు వదిలితే కుటుంబానికి సుఖసంతోషాలు కలుగుతాయి. ఈ రోజు పెరుగు దానం చేయడం వల్ల సంతాన క్షేమం, సంపద, ఆయుష్షు లభిస్తాయి. ఈ చిన్న పరిహారాలు పాటిస్తే సకల బాధలు తొలగి శుభాలు కలుగుతాయని శాస్త్రం చెబుతోంది.

News January 13, 2026

సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

image

<>CSIR<<>>-సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో 5 హిందీ ఆఫీసర్, MTS పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు ఫిబ్రవరి 16వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి పీజీ(హిందీ, ఇంగ్లిష్), టెన్త్/ITI, ఇంటర్ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. హిందీ ఆఫీసర్ పోస్టుకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ, MTS పోస్టులకు ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://cdri.res.in/

News January 13, 2026

తప్పుడు కథనాలు, మార్ఫింగ్ ఫొటోల కేసులపై SIT ఏర్పాటు

image

TG: సోషల్ మీడియాలో సీఎం రేవంత్ రెడ్డి మార్ఫింగ్ ఫొటోలు, మహిళా ఐఏఎస్‌పై తప్పుడు కథనాల కేసులపై ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. ఈ రెండు కేసులను దర్యాప్తు చేసేందుకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) ఏర్పాటు చేసింది. ఐపీఎస్‌లు శ్వేత, యోగేశ్ గౌతమ్ సహా మొత్తం 8 మంది పోలీస్ అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది.