News March 18, 2024
నాగర్ కర్నూల్‌పై బీజేపీ స్పెషల్ ఫోకస్

ఉమ్మడి జిల్లాలో నాగర్ కర్నూల్(SC) పార్లమెంట్ స్థానంపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఇక్కడి సిట్టింగ్ ఎంపీని పార్టీలో చేర్చుకోవడంతోపాటు ఇతర నేతల చేరికపై ప్రధానంగా దృష్టిసారించింది. ఇప్పటికే తమ అభ్యర్థి భరత్ కోసం ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఇక్కడ తమకు అనుకూల, ప్రతికూల పరిస్థితులపై బీజేపీ లెక్కలు వేస్తోండగా.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నుంచి నాగర్‌కర్నూల్ అభ్యర్థి ఎవరన్నది తెలాల్సి ఉంది.
Similar News
News April 10, 2025
ఇక నుంచి మానవ డోనర్ మిల్క్: జిల్లా కలెక్టర్

చంటి బిడ్డలకు తల్లిపాలు అందుబాటులో లేనప్పుడు మానవ డోనర్ మిల్క్‌ను అందించే సదుపాయాన్ని రాష్ట్రంలోనే మొదటిసారిగా MBNR ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఇది ఒక అద్భుతమైన అవకాశమని కలెక్టర్ విజయేంద్ర బోయి కొనియాడారు. సుశేషణ హెల్త్ ఫౌండేషన్ సహకారంతో ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సమగ్ర లాక్టేషన్ మేనేజ్మెంట్ సెంటర్‌ని ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు కలెక్టర్ ప్రారంభించారు.
News April 10, 2025
MBNR: ఏప్రిల్ 13న అంబేడ్కర్ విగ్రహావిష్కరణ

మహబూబ్‌గర్ జిల్లా నవాబ్‌పేట మండలం కారుకొండ గ్రామంలో అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ 13న అంబేడ్కర్ విగ్రహావిష్కరణ మహోత్సవం ఉంటుందని తెలంగాణ మాల మహానాడు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు చెన్నకేశవులు తెలిపారు. అతిథులుగా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, ఎంపీ డీకే అరుణ, లక్ష్మారెడ్డి, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య, మంత్రి నరసింహయ్య రానున్నారని చెప్పారు.
News April 10, 2025
మహబూబ్‌నగర్ జిల్లాలో 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతలు

మహబూబ్‌నగర్ జిల్లాలో గత 24 గంటల్లో ఉష్ణోగ్రతలు పెరిగాయి. మహమ్మదాబాద్ 39.9 డిగ్రీలు, నవాబుపేట 39.7 డిగ్రీలు, కౌకుంట్ల 39.6, చిన్నచింతకుంట 39.5, మిడ్జిల్ (M)కొత్తపల్లి 39.4, చిన్నచింతకుంట (M) వడ్డేమాన్ 39.2, మూసాపేట (M) జానంపేట 39.2, భూత్పూర్ (M) కొత్త మొల్గర 39.1, కోయిలకొండ 38.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజలు ఎండల తీవ్రతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.