News March 18, 2024
నాగర్ కర్నూల్‌పై బీజేపీ స్పెషల్ ఫోకస్
ఉమ్మడి జిల్లాలో నాగర్ కర్నూల్(SC) పార్లమెంట్ స్థానంపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఇక్కడి సిట్టింగ్ ఎంపీని పార్టీలో చేర్చుకోవడంతోపాటు ఇతర నేతల చేరికపై ప్రధానంగా దృష్టిసారించింది. ఇప్పటికే తమ అభ్యర్థి భరత్ కోసం ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఇక్కడ తమకు అనుకూల, ప్రతికూల పరిస్థితులపై బీజేపీ లెక్కలు వేస్తోండగా.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నుంచి నాగర్‌కర్నూల్ అభ్యర్థి ఎవరన్నది తెలాల్సి ఉంది.
Similar News
News October 6, 2024
MBNR: ‘తెలంగాణ వచ్చి పదేళ్లు దాటిన కేసులో మాఫీ కాలే’
రాష్ట్రం ఏర్పడి పదేళ్లు దాటినప్పటికీ ఉద్యమంలో నమోదైన కేసులు ఇప్పటికి మాఫీ కాలేదని మహబూబ్ నగర్ టీఎన్జీవో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రనాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. యూనియన్ కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సకల జనుల సమ్మె సందర్భంగా పోలీసులు వివిధ సెక్షన్ల కింద ఉద్యమకారులపై కేసులు నమోదు చేశారని ఆయన గుర్తు చేశారు.
News October 6, 2024
ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు!!
✒ఘనంగా బతుకమ్మ సంబరాలు
✒U-19 టోర్నీ.. ఫైనల్లో పాలమూరు ఓటమి
✒కొల్లాపూర్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
✒దుర్గామాతకు ప్రత్యేక పూజలు
✒మంత్రి సురేఖ మాటలు ముమ్మాటికీ తప్పే:DK అరుణ
✒మన్ననూరులో గద్దర్ విగ్రవిష్కరణ
✒వనపర్తి: లిఫ్టు కాలువలో పడి వ్యక్తి మృతి
✒కోస్గి:ముగిసిన రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలు
✒ధన్వాడ: చిరుత దాడిలో జింక మృతి
✒కురుమూర్తి బ్రహ్మోత్సవాలపై ప్రత్యేక ఫోకస్
News October 5, 2024
కల్వకుర్తి: సూర్య ప్రకాశ్ రావును అభినందించిన కేటీఆర్
కల్వకుర్తి పట్టణ సమీపంలోని సూర్యలత స్పిన్నింగ్ మిల్లులో ఇటీవల జరిగిన కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన సూర్య ప్రకాశ్ రావును మాజీ మంత్రి కేటీఆర్ శనివారం అభినందించారు. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌తో కలిసి వారు కేటీఆర్‌ను కలిశారు.