News January 27, 2025
నవశకానికి నాంది పలికాం: సీఎం రేవంత్

TG: ఒకే రోజు నాలుగు సంక్షేమ పథకాలు ప్రారంభించి నవశకానికి నాంది పలికామని CM రేవంత్ ట్వీట్ చేశారు. ‘రైతును రాజును చేసే ‘రైతుభరోసా’, కూలీకి చేయూతనిచ్చే ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’, పేదల సొంతింటి కల సాకారం చేసే ‘ఇందిరమ్మ ఇళ్లు’, అన్నార్తుల ఆకలి తీర్చే ‘కొత్త రేషన్ కార్డులు’ వంటి పథకాలతో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపబోతున్నాం. ఈ సరికొత్త అధ్యాయాన్ని నా సొంత నియోజకవర్గంలో ప్రారంభించాను’ అని పేర్కొన్నారు.
Similar News
News November 3, 2025
మీర్జాగూడ ప్రమాదం.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు

TG: మీర్జాగూడ<<18183462>> ప్రమాదంలో<<>> మృతులంతా చేవెళ్ల వాసులేనని తెలుస్తోంది. నిన్న ఆదివారం సెలవు దినం కావడంతో ఇంటికి వెళ్లి తిరిగి హైదరాబాద్ వస్తున్నట్లు సమాచారం. మరణించిన వారిలో ఎక్కువ మంది ఉద్యోగులే ఉన్నారు. మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు సహాయక చర్యల పర్యవేక్షణకు సెక్రటేరియట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కాంటాక్ట్ నం: 9912919545, 9440854433.
News November 3, 2025
బస్సు ప్రమాదంలో 25కు పెరిగిన మృతుల సంఖ్య

TG: రంగారెడ్డి జిల్లా బస్సు ప్రమాదంలో <<18183371>>మృతుల సంఖ్య<<>> భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు 25 మంది మరణించారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులంతా తాండూరు, చేవెళ్ల వాసులేనని సమాచారం. మరోవైపు ఘటనాస్థలం వద్ద స్థానికులు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే యాదయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డు విస్తరణ ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు.
News November 3, 2025
ఎయిమ్స్ రాయ్‌బరేలిలో జూనియర్ రెసిడెంట్ పోస్టులు

ఎయిమ్స్ రాయ్‌బరేలి 16 జూనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. ఎంబీబీఎస్, BDS అర్హతతో పాటు ఇంటర్న్‌షిప్ చేసినవారు ఈనెల 10న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. అభ్యర్థుల గరిష్ట వయసు 37ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు రూ.56,100 జీతం అందుతుంది. వెబ్‌సైట్: https://aiimsrbl.edu.in/


