News March 18, 2024
అన్నమయ్య: ఉద్యోగాల పేరుతో రూ.10 కోట్లు స్వాహా

ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి పలువురిని మోసం చేసిన ఓ యువకుడి ఉదంతం అన్నమయ్య జిల్లా పీలేరులో వెలుగు చూసింది. పట్టణంలోని బండ్లవంకకు చెందిన రెడ్డి సూర్యప్రసాద్ అలియాస్ భరత్ హైదరాబాద్, బెంగళూరులో నివాసం ఏర్పరచుకున్నాడు. 400 మందికి పైగా నిరుద్యోగులకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని ముందుగా డిపాజిట్ రూపంలో రూ.10 కోట్లకు పైగా తీసుకున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు సీఐ మోహన్ రెడ్డి కేసు నమోదు చేశారు.
Similar News
News January 31, 2026
కలసపాడు: పంచాయతీ కార్యదర్శి గ్రూప్-2కు ఎంపిక

కలసపాడు మండలంలో పలు పంచాయతీలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన లక్ష్మీ సృజన ఇటీవల విడుదలైన గ్రూప్-2 ఫలితాల్లో సీనియర్ అకౌంటెంట్ ఆఫీసర్‌గా ఎంపిక అయ్యారు. కలసపాడు మండలంలోని పలు పంచాయతీల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. సృజన పనితీరు, మంచితనం ప్రజలను గౌరవించడం ఆమె కృషికి ఈ ఎంపిక సంతోషకరమని పలువురు ప్రజలు అభినందించారు.
News January 30, 2026
కడప: అక్రిడిటేషన్ల జారీకి ఆమోదం.!

కడప జిల్లాలోని అర్హులైన 569 మంది జర్నలిస్టులకు తొలి విడతలో అక్రిడిటేషన్లు మంజూరు చేస్తూ జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ ఆమోదం తెలిపిందని DMAC ఛైర్మన్, జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం జరిగింది. అర్హులైన జర్నలిస్టులందరికీ నిబంధనల ప్రకారం అక్రిడిటేషన్లు మంజూరు చేశామని, మొదటి సమావేశంలో 569కి కమిటీ ఆమోదం తెలిపిందన్నారు.
News January 30, 2026
ఫిబ్రవరి 1న పార్నపల్లెకు రానున్న గౌతమ్ ఆదాని

లింగాల(M) పార్నపల్లె గ్రామ సమీపంలోని చిత్రావతి డ్యాం వద్ద నిర్మాణంలో ఉన్న ఆదాని పవర్ ప్లాంట్‌ను ఫిబ్రవరి 1న పారిశ్రామికవేత్త గౌతమ్ ఆదాని సందర్శించనున్నారు. డ్యాంలోని నీటిని రివర్స్ పంపింగ్ చేయడంవల్ల విద్యుత్తును తయారు చేసే విధంగా ఈ ప్లాంట్‌ను రూపకల్పన చేశారు. ఈ సందర్భంగా డ్యామ్ వద్ద ఉన్న హెలిప్యాడ్‌ను డీఎస్పీ మురళి నాయక్, అధికారులు పరిశీలించారు.


