News March 18, 2024
అన్నమయ్య: ఉద్యోగాల పేరుతో రూ.10 కోట్లు స్వాహా

ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి పలువురిని మోసం చేసిన ఓ యువకుడి ఉదంతం అన్నమయ్య జిల్లా పీలేరులో వెలుగు చూసింది. పట్టణంలోని బండ్లవంకకు చెందిన రెడ్డి సూర్యప్రసాద్ అలియాస్ భరత్ హైదరాబాద్, బెంగళూరులో నివాసం ఏర్పరచుకున్నాడు. 400 మందికి పైగా నిరుద్యోగులకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని ముందుగా డిపాజిట్ రూపంలో రూ.10 కోట్లకు పైగా తీసుకున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు సీఐ మోహన్ రెడ్డి కేసు నమోదు చేశారు.
Similar News
News April 14, 2026
కడప జిల్లాలో బెల్ట్ షాపులపై 47 కేసులు

కడప జిల్లా వ్యాప్తంగా మద్యం బెల్ట్ షాపులపై విస్తృతస్థాయిలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఒకేరోజు 47 కేసులు నమోదు చేశారు. 47 మంది నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 579 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. 554 క్వార్టర్ బాటిళ్ల మద్యం, 25 బీర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. అనుమతులు లేకుండా అక్రమంగా మద్యం విక్రయాలు జరిపితే చర్యలు తీసుకుంటామని ఎస్పీ విశ్వనాథ్ హెచ్చరించారు.
News April 14, 2026
కడప: స్పోర్ట్స్ కోటా టీచర్లకు తిరుపతిలో రేపు సమావేశం

మెగా డీఎస్సీ 2025లో స్పోర్ట్స్ కోట ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు ఈ నెల 15న తిరుపతిలో సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శంషుద్దీన్ మంగళవారం తెలిపారు. కొత్తగా నియామకమైన ఉపాధ్యాయులు ఉదయం 9 గంటలకు డీఎస్డీవో/డీఎస్ఏ కార్యాలయం, తిరుపతిలో తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు. విద్యాశాఖ మంత్రి ప్రత్యేక సందేశం ఇవ్వనున్నట్లు తెలిపారు.
News April 13, 2026
నిర్ణీత సమయంలో సమస్యలు పరిష్కరించాలి: SP

కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక”లో జిల్లా SP షెల్కే నచికేత్ విశ్వనాథ్ పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 152 ఫిర్యాదులను సోమవారం స్వీకరించారు. బాధితులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, చట్టపరమైన పరిమితుల్లో నిర్ణీత గడువులోపు ఫిర్యాదులను పరిష్కరించాలని ఆదేశించారు.


