News January 27, 2025

ఉత్తరాఖండ్‌లో అమలులోకి వచ్చిన UCC

image

దేశంలోనే తొలిసారిగా ఉత్తరాఖండ్‌లో ఉమ్మడి పౌరస్మృతి(UCC) అమలులోకి వచ్చింది. రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఈ విషయాన్ని ప్రకటించారు. ‘యూసీసీతో సమాజంలో అనేక విషయాల్లో అసమానతలు తొలగుతాయి. పౌరులందరికీ సమానమైన హక్కులు, బాధ్యతలు దక్కుతాయి’ అని పేర్కొన్నారు. కాగా.. ఇది ఏకాభిప్రాయం లేని ప్రయోగాత్మక ప్రాజెక్ట్ అంటూ కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది.

Similar News

News January 29, 2025

మౌని అమావాస్య.. ఇవాళ ఇలా చేస్తే..

image

పుష్యమాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్య అంటారు. ఇవాళ మౌని అమావాస్య సందర్భంగా పుణ్య నదుల్లో స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు వదిలితే ఉత్తమ లోకాలకు చేరుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. నదికి వెళ్లలేని వారు బావి వద్ద స్నానం చేయాలి. గంగామాతను పూజించి హారతి ఇవ్వాలి. శివాలయాలకు వెళ్లి నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి శివుడికి రుద్రాభిషేకం చేయాలి. అవకాశం ఉంటే మౌన వ్రతం పాటించాలి. సామర్థ్యం మేరకు దానం చేయాలి.

News January 29, 2025

మరోసారి డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా?

image

AP: రాష్ట్ర నూతన డీజీపీగా మరోసారి హరీశ్ కుమార్ గుప్తా పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీ కాలం ఎల్లుండితో ముగియనుండటంతో హరీశ్ పేరును ఫైనల్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం గుప్తా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ DGగా ఉన్నారు. గత ఎలక్షన్ల సమయంలో హరీశ్‌ను ఎన్నికల సంఘం DGPగా నియమించిన విషయం తెలిసిందే.

News January 29, 2025

సర్పంచ్ ఎన్నికలపై UPDATE

image

TG: పంచాయతీ రాజ్ శాఖపై సీఎం రేవంత్ ఇవాళ సమీక్ష నిర్వహించనున్నారు. ఆ శాఖలో పెండింగ్ జీతాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి చివరి వారంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. నేడు దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారా? ఏదైనా ప్రకటన చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.