News March 18, 2024
మోదీతోనే భారత్ సురక్షితం: అర్వింద్

ప్రధాని నరేంద్ర మోదీతోనే భారత్ సురక్షితంగా ఉంటుందని, నరేంద్ర మోదీని మూడవసారి ప్రధానిగా గెలిపించాలని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. జగిత్యాలలో సోమవారం విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడారు. సైనికుడు అభినందన్ ను పాకిస్థాన్ చెర నుండి విడిపించిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీ దన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో బిజెపి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
Similar News
News January 11, 2026
NZBకు TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ రాక

TPCC చీఫ్, MLC మహేశ్ కుమార్ గౌడ్ ఆదివారం నిజామాబాద్ వస్తున్నారు. ఉదయం 8 గంటలకు HYD నార్సింగి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 11.30కు NZB చేరుకుంటారు. 12 గంటలకు స్థానికంగా నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొని మధ్యాహ్నం 3 గంటలకు R&B గెస్ట్ హౌస్లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. రాత్రి నిజామాబాద్లో బస చేసి సోమవారం ఉదయం 11 గంటలకు వరంగల్ బయలుదేరి వెళ్తారు.
News January 11, 2026
NZB: చైనా మాంజా విక్రయాలపై పోలీసుల తనిఖీలు

చైనా మాంజా విక్రయాలపై పోలీసులు కొరడా ఝులిపించారు. సీపీ సాయి చైతన్య ఆదేశాల మేరకు NZB, బోధన్, ఆర్మూర్ డివిజన్ పరిధిలోని స్టేషన్ల పరిధిలో భారీగా తనిఖీలు చేశారు. నిషేధిత చైనా మాంజా ఎవరైనా విక్రయించినా, నిల్వ, రవాణా చేసినా నేరమేనని సీపీ తెలిపారు. చైనా మాంజా విక్రయం వల్ల, జంతువులకు, పక్షులకు, మనుషులకు ప్రమాదం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. ఎవరైనా చైనా మాంజా విక్రయిస్తే 100కు సమాచారం ఇవ్వాలన్నారు.
News January 11, 2026
నిజామాబాద్: జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు సాయి ప్రసన్న

జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు నిజామాబాద్ జిల్లా క్రీడాకారిని సాయి ప్రసన్న ఎంపికైంది. సబ్ జూనియర్ 32 కేజీల విభాగంలో రాష్ట్రస్థాయిలో బంగారు పతకం సాధించడంతో జాతీయ స్థాయికి ఎంపికైనట్లు అసోసియేషన్ కార్యదర్శి మనోజ్ కుమార్ తెలిపారు. ఈ నెల 13 నుంచి 15 వరకు న్యూఢిల్లీలో జరిగే జాతీయ పోటీల్లో సాయి ప్రసన్న పాల్గొననుంది.


