News March 18, 2024

మోదీతోనే భారత్ సురక్షితం: అర్వింద్

image

ప్రధాని నరేంద్ర మోదీతోనే భారత్ సురక్షితంగా ఉంటుందని, నరేంద్ర మోదీని మూడవసారి ప్రధానిగా గెలిపించాలని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. జగిత్యాలలో సోమవారం విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడారు. సైనికుడు అభినందన్ ను పాకిస్థాన్ చెర నుండి విడిపించిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీ దన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో బిజెపి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

Similar News

News April 19, 2026

SRSP ఆస్తుల జప్తునకు రంగారెడ్డి కోర్టు ఆదేశాలు

image

SRSP కాకతీయ కాల్వ పనుల బిల్లులు చెల్లించడంలో నిర్లక్ష్యం ప్రదర్శించిన నీటిపారుదల శాఖపై రంగారెడ్డి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంకటేశ్వర ఇంజినీర్స్ అండ్ కాంట్రాక్టర్స్ చేసిన రూ.16కోట్ల పనుల బిల్లుల పెండింగ్‌పై కేసు నమోదైంది. కోర్టు ఆదేశాలు పాటించకపోవడంతో నిజామాబాద్ జిల్లా పోచంపాడ్ కార్యాలయంలో రూ.50 లక్షల విలువైన ఫర్నిచర్, 24 ఏసీలు, 2 కార్లు జప్తు చేయాలని న్యాయమూర్తి శనివారం ఆదేశాలు జారీ చేశారు.

News April 19, 2026

నిజామాబాద్ ఏఎస్పీగా శుభం ప్రకాశ్

image

నిజామాబాద్ ఏఎస్పీగా శుభం ప్రకాశ్ నియమితులయ్యారు. వరంగల్ ఏసీపీగా ఉన్న శుభం ప్రకాశ్‌‌ను అడిషనల్ ఎస్పీగా నిజామాబాద్‌కు బదిలీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులను జారీ చేసింది. 2022 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన స్వస్థలం మహారాష్ట్రలోని వార్ధా జిల్లా. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో కంప్యూటర్ సైన్స్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేశారు.

News April 18, 2026

NZB: సంక్షేమ వారోత్సవాలను విజయవంతం చేయాలి

image

ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 20 నుంచి 26 వరకు నిర్వహించే సంక్షేమ వారోత్సవాలను సంబంధిత అధికారులు విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్‌లు కిరణ్ కుమార్, దిలీప్ కుమార్ సూచించారు. శనివారం వారు మాట్లాడుతూ.. సంక్షేమ శాఖల అధికారులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, మండలాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు వారోత్సవాలను విజయవంతం చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు.