News January 27, 2025
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

TG: రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కీలక నిందితుల్లో ఒకరైన అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ అనంతరం విచారణకు సహకరించాలని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీశ్ చంద్రతో కూడిన బెంచ్ ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయొద్దని, అవసరమైతే ట్రయల్ కోర్టు బెయిల్‌పై మరిన్ని షరతులు విధించాలని స్పష్టం చేసింది.
Similar News
News September 16, 2025
భార్య చివరి కోరిక నెరవేర్చిన భర్త

AP: తనను ఉపాధ్యాయుడిగా చూడాలన్న భార్య చివరి కోరికను తీర్చాడు భర్త. ఎన్టీఆర్(D) రెడ్డికుంటకు చెందిన రామకృష్ణ భార్య ఏడాది క్రితం డెంగీతో మరణించారు. ఇటీవల ఫలితాల్లో స్కూల్ అసిస్టెంట్(బయాలజీ)గా DSCలో ఎంపికయ్యారు. ఆమె చివరి కోరికను తీర్చడానికి రోజుకు 10 గంటలకు పైగా చదివినట్లు రామకృష్ణ తెలిపారు. తన భార్య బతికి ఉంటే సంతోషించేదని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.
News September 16, 2025
వివేకా హత్య కేసులో దర్యాప్తుకు సిద్ధం: సీబీఐ

AP: వైఎస్ వివేకా హత్య కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నామని సుప్రీంకోర్టుకు సీబీఐ తెలిపింది. కోర్టు తగిన ఆదేశాలిస్తే ముందుకు వెళ్తామని పేర్కొంది. పిటిషనర్ ఈ కేసులో ఇంకా దర్యాప్తు చేయాలని కోరుతున్నారని చెప్పింది. ఈ మేరకు సీబీఐ అభిప్రాయాన్ని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు తెలిపారు.
News September 16, 2025
ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

TG: రాబోయే 3 గంటల్లో కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని IMD ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, హనుమకొండ, భూపాలపల్లి, జగిత్యాల, జనగాం, కరీంనగర్, మేడ్చల్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, భువనగిరిలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.