News January 27, 2025

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

image

TG: రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కీలక నిందితుల్లో ఒకరైన అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ అనంతరం విచారణకు సహకరించాలని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీశ్ చంద్రతో కూడిన బెంచ్ ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయొద్దని, అవసరమైతే ట్రయల్ కోర్టు బెయిల్‌పై మరిన్ని షరతులు విధించాలని స్పష్టం చేసింది.

Similar News

News February 10, 2025

వీరు త్వరగా ముసలోళ్లు కారు?

image

అన్ని రక్త వర్గాల్లో కంటే B బ్లడ్ గ్రూప్ వారు నెమ్మదిగా వృద్ధాప్యం పొందుతారని ప్లానెట్ టుడే సర్వే తెలిపింది. మిగతా గ్రూపులతో పోల్చుకుంటే ఈ గ్రూప్ వారు నెమ్మదిగా ముసలోళ్లుగా మారతారని పేర్కొంది. వీరి రక్తంలో కణాల పునరుత్పత్తి, కణజాల మరమ్మతులు మెరుగ్గా ఉండటం వల్ల యవ్వనంగా కనిపిస్తారని తెలిపింది. అలాగే వీరికి సుదీర్ఘ ఆయుర్దాయం కూడా ఉంటుందని వెల్లడించింది.

News February 10, 2025

రేపు మహా కుంభమేళాకు రాష్ట్రపతి

image

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రేపు మహాకుంభమేళాకు వెళ్లనున్నారు. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం ఆచరించనున్నారు. అనంతరం స్థానిక ఆలయంలో పూజలు చేస్తారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ప్రయాగ్ రాజ్‌లో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

News February 9, 2025

ఇంగ్లండ్ చెత్త రికార్డు

image

వన్డేల్లో ఇంగ్లండ్ చెత్త రికార్డు మూటగట్టుకుంది. 300కు పైగా స్కోర్ చేసి అత్యధిక సార్లు పరాజయం పాలైన జట్టుగా నిలిచింది. 99 మ్యాచుల్లో 28 సార్లు ఇంగ్లండ్ ఓడింది. ఆ తర్వాతి స్థానాల్లో భారత్(27), వెస్టిండీస్(23), శ్రీలంక(19) ఉన్నాయి. వన్డే WC 2023 తర్వాత ఇంగ్లండ్‌కు ఇది వరుసగా నాలుగో సిరీస్ ఓటమి.

error: Content is protected !!