News January 27, 2025

ICC వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా స్మృతి

image

2024కు గాను ICC ఉమెన్స్ ODI క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును భారత ప్లేయర్ స్మృతి మంధాన సొంతం చేసుకున్నారు. ఆమె రెండోసారి ఈ అవార్డుకు ఎంపికవడం విశేషం. గత ఏడాది స్మృతి 13 ఇన్నింగ్స్‌లలో 747 రన్స్ చేశారు. ఇందులో 4 సెంచరీలున్నాయి. ఇక ICC మెన్స్ ODI క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌ అవార్డును అఫ్గాన్ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా సాధించారు. ఈయన 14 మ్యాచ్‌లలో 417 రన్స్‌తో పాటు 17 వికెట్లను పడగొట్టారు.

Similar News

News July 9, 2025

పెంపుడు కుక్క మీ జీవితకాలాన్ని పెంచుతుంది!

image

పెంపుడు కుక్కలున్న యజమానులు ఇతరులతో పోల్చితే రోజుకు 22ని.లు ఎక్కువగా నడుస్తారని లివర్‌పూర్ విశ్వవిద్యాలయ పరిశోధనలో వెల్లడైంది. ఇలా ఏటా మిలియన్ కంటే ఎక్కువ అడుగులు అదనంగా వేస్తారని తేలింది. యజమానులు కుక్క వేగానికి తగ్గట్లు నడిస్తే హైబీపీ& కొలెస్ట్రాల్, టైప్ 2 డయాబెటిస్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుందని పేర్కొంది. తద్వారా వారి జీవితకాలం పెరుగుతుంది. మీకూ పెంపుడు కుక్క ఉందా? కామెంట్ చేయండి.

News July 9, 2025

మూడో టెస్టుకు టీమ్ ప్రకటన.. స్టార్ పేసర్ రీఎంట్రీ

image

భారత్‌‌తో రేపటి నుంచి జరగనున్న మూడో టెస్టుకు ఇంగ్లండ్ ఒక్క మార్పుతో జట్టును ప్రకటించింది. జోష్ టంగ్ ప్లేస్‌లో స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ నాలుగేళ్ల తర్వాత కమ్‌బ్యాక్ ఇస్తున్నారు. దీంతో ENG బౌలింగ్ అటాక్ స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. లార్డ్స్‌లో గ్రీన్ పిచ్‌ ఉండనుందన్న వార్తల నేపథ్యంలో ఆర్చర్ కీలకంగా మారనున్నారు.
ENG: క్రాలే, డకెట్, పోప్, రూట్, బ్రూక్, స్టోక్స్, స్మిత్, వోక్స్, కార్స్, ఆర్చర్, బషీర్

News July 9, 2025

రేపట్నుంచే మామిడి రైతుల అకౌంట్లో డబ్బుల జమ

image

AP: మామిడి రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు సీఎం చంద్రబాబు రూ.260 కోట్ల నిధుల విడుదలకు నిర్ణయించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూడకుండా ఇవాళ జరిగిన క్యాబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రభుత్వం కిలోకు అదనంగా రూ.4 మద్దతు ధర ప్రకటించి మామిడి కొనుగోళ్లు చేపట్టిందన్నారు. ఆ డబ్బులను రేపటి నుంచి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు.