News March 18, 2024
20న కోస్తాంధ్రలో భారీ వర్షాలు

AP: రాష్ట్రంలో నాలుగు రోజులపాటు విభిన్న వాతావరణం ఉంటుందని IMD వెల్లడించింది. విపరీతమైన ఎండలు, ఉక్కపోతతోపాటు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4 డిగ్రీలు అధికంగా నమోదవుతాయని పేర్కొంది. ఈ నెల 20న ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని, దీని ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.
Similar News
News July 6, 2025
ఉపవాసంతో ఎన్ని లాభాలంటే?

పుణ్యం కోసం చేసినా, ఆరోగ్యం కోసం చేసినా ఉపవాసం వల్ల శరీరానికి ఎన్నో లాభాలుంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
*శరీరం డీటాక్సిఫై అవుతుంది
*జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి
*ఉపవాసంలో పండ్లు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది
*ఒత్తిడి తగ్గి, ఏకాగ్రత పెరిగే అవకాశం ఉంటుంది
*శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి బరువు తగ్గుతారు
News July 6, 2025
టెక్సాస్ వరదలు.. 32కు చేరిన మృతుల సంఖ్య

అమెరికాలోని టెక్సాస్‌లో అకాల వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కెర్ కౌంటీ షెరీఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. వరదల వల్ల చనిపోయినవారి సంఖ్య 32కు చేరుకుంది. మృతుల్లో 18 మంది పెద్దవాళ్లుకాగా.. 14 మంది చిన్నారులు ఉన్నారు. గల్లంతైన 27 మంది కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి. రికవరీ చేసిన 8 మృతదేహాలు ఎవరివో గుర్తించలేకపోతున్నారు. మృతుల కుటుంబాలకు అధ్యక్షుడు ట్రంప్ సానుభూతి తెలియజేశారు.
News July 6, 2025
తొలి ఏకాదశి రోజు ఏం చేయాలంటే?

ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి/శయన ఏకాదశి అంటారు. ఈరోజు నుంచి విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తారని నమ్ముతారు. ఉదయాన్నే తలస్నానం చేసి విష్ణువును తులసి దళాలతో పూజిస్తారు. ఈరోజు పూజించడం వల్ల ఆయన అనుగ్రహం లభిస్తుందని, ఏకాదశి రోజున ఉపవాసముంటే మోక్షం కలుగుతుందని నమ్ముతారు. అలాగే ఈ ఒక్కరోజు ఉపవాసముంటే సంవత్సరంలోని అన్ని ఏకాదశుల ఉపవాస ఫలితం లభిస్తుందని పండితులు చెబుతారు.