News March 18, 2024
20న కోస్తాంధ్రలో భారీ వర్షాలు

AP: రాష్ట్రంలో నాలుగు రోజులపాటు విభిన్న వాతావరణం ఉంటుందని IMD వెల్లడించింది. విపరీతమైన ఎండలు, ఉక్కపోతతోపాటు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4 డిగ్రీలు అధికంగా నమోదవుతాయని పేర్కొంది. ఈ నెల 20న ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని, దీని ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.
Similar News
News February 8, 2026
భాను సప్తమి పూజా విధానం

తెల్లవారుజామునే నిద్రలేచి స్నానమాచరించాలి. ఉదయించే సూర్యుడికి అభిముఖంగా నిలబడి, రాగి పాత్రలో నీటితో అర్ఘ్యం సమర్పించాలి. పూజల ఎరుపు రంగు పూలు, ధూపం, దీపం సమర్పించాలి. సూర్య అష్టోత్తరం, గాయత్రీ మంత్రం జపించాలి. గోధుమలతో చేసిన వంటకాలు, పరమాన్నం నైవేద్యంగా పెట్టాలి. సూర్యుడి దివ్య కాంతిపై దృష్టి కేంద్రీకరించి ప్రార్థనలు చేయాలి. ఇలా చేస్తే మన అడ్డంకులన్నీ తొలగి, ఉన్నత స్థితికి చేరుతామని నమ్మకం.
News February 8, 2026
కనకాంబరం దిగుబడి పెరగాలంటే ఏం చేయాలి?

కనకాంబరం దిగుబడి పెరగాలంటే మొక్కలు పెరిగే తొలిదశలో కలుపు లేకుండా చూడాలి. వేసవిలో ఎండ తీవ్రతను తగ్గించడానికి అవిసె మొక్కలను పెంచితే పాక్షిక నీడ ఏర్పడి మొక్కలు బాగా పెరిగి అధిక పూల దిగుబడి వస్తుంది. పూలు కోయడం పూర్తైన తర్వాత పూల గుత్తులను, ఎండు కొమ్మలను తొలగిస్తే ఏడాది పొడవునా పువ్వులు పూసి దిగుబడి పెరుగుతుంది. కనకాంబరం పువ్వులను రోజు విడిచి రోజు ఉదయం లేదా సాయంత్రం వేళల్లో కోయాలి.
News February 8, 2026
శ్రీశైలంలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు

AP: శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ఈ నెల 18 వరకు జరగనున్నాయి. ఉత్సవాల నేపథ్యంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. రోజూ విశేష పూజలు, వాహనసేవలతో గ్రామోత్సవాలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలు, వీఐపీ స్పర్శ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే శివదీక్షా భక్తులకు ఈ నెల 12 వరకూ స్పర్శ దర్శనాలు కల్పిస్తారు.


