News January 27, 2025

ఘోరం: శానిటరీ ప్యాడ్ అడిగిన బాలికను..

image

శానిటరీ ప్యాడ్ అడిగిన 11వ తరగతి బాలిక పట్ల ప్రిన్సిపల్ అమానవీయంగా ప్రవర్తించిన ఘటన UP బరేలీలో జరిగింది. ఎగ్జామ్ రాస్తుండగా విద్యార్థినికి పీరియడ్స్ మొదలయ్యాయి. బ్లీడింగ్ కావడంతో దిక్కుతోచని ఆమె శానిటరీ ప్యాడ్ ఇవ్వాలని ప్రిన్సిపల్‌ను అడిగింది. వెంటనే ఏర్పాటుచేయాల్సిన ఆయన బాలికను అవమానిస్తూ గంటపాటు బయట నిలబెట్టాడు. ఈ ఘటనపై ఆమె తండ్రి ఫిర్యాదుతో విచారణ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Similar News

News November 12, 2025

జూబ్లీహిల్స్ పోలింగ్.. ఫైనల్ లెక్క ఇదే

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో 48.49% పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు వెల్లడించారు. మొత్తం 4,01,365 ఓటర్లకు గాను 1,94,631 మంది ఓటేశారు. ఈ నెల 14న ఉ.8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. మొత్తం 10 రౌండ్లలో ఓట్లను లెక్కిస్తారు. 42 టేబుళ్లు ఏర్పాటు చేశారు. కాగా మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుస్తారని అంచనా వేశాయి.

News November 12, 2025

ఢిల్లీ పేలుడు: తబ్లీగీ జమాత్ మసీదులో 15 నిమిషాలు గడిపి..

image

ఢిల్లీ పేలుడు ఘటనలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఉమర్ నబీకి సంబంధించి కీలక విషయాలు బయటపడుతున్నాయి. బ్లాస్ట్‌కు ముందు ఓల్డ్ ఢిల్లీలోని తబ్లీగీ జమాత్ మసీదుకు అతడు వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ 10-15 నిమిషాలు గడిపాడని, తర్వాత ఎర్రకోటలోని పార్కింగ్ ప్లేస్‌కు వెళ్లాడని ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి. అతడు మసీదులోకి వచ్చి వెళ్లిన ఫుటేజీ సీసీటీవీలో రికార్డయిందని చెప్పాయి.

News November 12, 2025

శీతాకాలంలో ఆహారాన్ని మళ్లీ వేడి చేస్తే జరిగేది ఇదే?

image

చలికాలంలో వేడివేడిగా తినాలనే ఉద్దేశంతో చాలామంది ఆహారాన్ని మళ్లీ వేడి చేసుకుంటారు. పదే పదే ఆహారాన్ని వేడి చేస్తే పోషకాలు తగ్గడంతోపాటు బ్యాక్టీరియా పెరిగి ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. బియ్యం, బంగాళాదుంపలు, పుట్టగొడుగులు, చికెన్, గుడ్లలో బాసిల్లస్ సెరియస్ అనే బ్యాక్టీరియా పెరిగి కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, ఫుడ్ పాయిజనింగ్‌కి కారణమవుతుంది. నూనెలు, మసాలాలు ఆక్సిడైజ్ అవుతాయి.