News January 28, 2025

BREAKING: ఘోర ప్రమాదాలు.. ఐదుగురు దుర్మరణం

image

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ఉదయం రెండు ఘోర ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. HYD రాజేంద్రనగర్ పరిధిలో ఆరాంఘర్ ఫ్లైఓవర్‌పై డివైడర్‌ను బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఇక ఏపీలోని నంద్యాల చాపిరేవులలో ఓ ఇంట్లో వంట చేస్తుండగా సిలిండర్ పేలింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Similar News

News January 20, 2026

‘వ్యవసాయ యాంత్రీకరణ’ పథకంలో రాయితీ ఇలా..

image

TG: ఈ పథకం కింద యంత్రాల కొనుగోలుకు ప్రభుత్వం భారీగా సబ్సిడీ ఇస్తోంది. లబ్ధిదారుల కేటగిరీని బట్టి దీనిలో వాటా ఉంటుంది. సన్న, చిన్నకారు, మహిళా రైతులు, SC, ST, BC రైతులు యంత్రాన్ని కొనుగోలు చేస్తే ధరలో 50% వారు భరించాలి. మిగిలిన 50 శాతాన్ని ప్రభుత్వం రాయితీగా నేరుగా కంపెనీ ఖాతాలో జమ చేస్తుంది. ఇతర రైతులు యంత్రం ధరలో 60 శాతం వాటాను భరించాల్సి ఉండగా.. 40 శాతాన్ని ప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరిస్తుంది.

News January 20, 2026

భక్తులకు TTD గుడ్ న్యూస్.. ఇక రెండుపూటలా అన్నప్రసాదం!

image

AP: CM చంద్రబాబు ఆదేశాల మేరకు మార్చి నెలాఖరు నుంచి TTD పరిధిలోని అన్ని ఆలయాల్లో భక్తులకు రెండుపూటలా అన్నప్రసాదం అందించనున్నట్లు EO అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. మొత్తం 56 ఆలయాల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. వీటితో పాటు ఖాళీగా ఉన్న AE పోస్టుల భర్తీకి ఏప్రిల్‌లో ఎగ్జామ్స్ నిర్వహించాలని, కొత్తగా ఎంపికైన వేద పారాయణదారులకు నియామక పత్రాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

News January 20, 2026

దావోస్‌లో నారా లోకేశ్ న్యూ లుక్

image

పెట్టుబడులే లక్ష్యంగా AP CM చంద్రబాబు బృందం దావోస్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మంత్రి లోకేశ్ కూడా ఈ బృందంలో సభ్యుడిగా ఉన్నారు. ఈ పర్యటనలో ఆయన కూడా పెట్టుబడిదారులతో విస్తృతంగా సమావేశమవుతున్నారు. APలో పెట్టుబడులు పెట్టాలని ఇన్వెస్టర్స్‌ని ఆహ్వానిస్తున్నారు. అయితే ఆయన ఈసారి కొత్తగా టీ షర్ట్‌లో కనిపించారు. దీంతో న్యూలుక్ ఫొటోలు SMలో వైరలవుతున్నాయి. పైగా ఆయన కాస్త స్లిమ్‌గా కూడా కనిపిస్తున్నారు.