News March 18, 2024
పెట్రో ధరలు మన దగ్గరే ఎక్కువ!

తెలుగు రాష్ట్రాల్లో పెట్రో ధరలు ప్రజల నడ్డి విరుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో లీటరు పెట్రోలు ధర రూ.109.87గా ఉండగా.. డీజిల్ ధర రూ.97.60గా ఉంది. ఇది దేశంలోనే అత్యధికం. ఇక రెండో స్థానంలో కేరళ(పెట్రోల్ రూ.107.54, డీజిల్ రూ.96.41), మూడో స్థానంలో తెలంగాణ(పెట్రోల్ రూ.107.39, డీజిల్ రూ.95.63) ఉన్నాయి. ఎక్సైజ్ డ్యూటీ విషయంలో కేంద్రం ఊరటనిస్తున్నా.. రాష్ట్రాల వ్యాట్ బాదుడు కారణంగా పెట్రో ధరలు మండిపోతున్నాయి.
Similar News
News August 13, 2025
E20 పెట్రోల్‌పై ఆ ప్రచారాలు తప్పు: కేంద్రం

E20 పెట్రోల్‌పై వస్తున్న <<17378231>>పుకార్లను<<>> కేంద్రం కొట్టిపారేసింది. దీని వల్ల పొల్యూషన్ తగ్గడమే కాకుండా వాహనాల పికప్ కూడా పెరుగుతుందని వెల్లడించింది. E10 పెట్రోల్‌తో పోలిస్తే 30% తక్కువ కార్బన్ ఉద్గారాలు వెలువడతాయని పేర్కొంది. మైలేజీ తగ్గుతుందన్న ప్రచారంలో నిజం లేదంది. డ్రైవింగ్ విధానం, వాహనం మెయింటెనెన్స్, టైర్ ప్రెషర్, AC లోడ్ వంటి వాటిపై మైలేజీ ఆధారపడి ఉంటుందని కేంద్రం వివరించింది.
News August 13, 2025
సెమీ కండక్టర్ రంగంలో వేగంగా అడుగులు: మోదీ

భారతదేశం <<17381479>>సెమీ కండక్టర్<<>> రంగంలో వేగంగా అడుగులు వేస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. AP, ఒడిశా, పంజాబ్‌కు సెమీ కండక్టర్ యూనిట్లు మంజూరు కావడంపై తెలుగులో ట్వీట్ చేశారు. ‘ఏపీ, ఒడిశా, పంజాబ్‌లో కొత్త యూనిట్ల ఏర్పాటుకు మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం తయారీ సామర్థ్యాన్ని పెంచుతుంది. అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగాలను సృష్టిస్తుంది. ప్రపంచ సరఫరా వ్యవస్థలో దేశాన్ని కీలక పాత్రధారిగా ఉంచుతుంది’ అని తెలిపారు.
News August 13, 2025
పైరసీ పెరగడానికి నిర్మాతలు, ప్రభుత్వాలే కారణమా?

సినిమా పైరసీ పెరగడానికి నిర్మాతలు, GOVTలే పరోక్షంగా కారణమనే సమాధానాలు అభిమానుల నుంచి వినిపిస్తున్నాయి. కొత్త సినిమాలకు ప్రత్యేక రేట్లతో స్పెషల్ <<17383707>>GOలిస్తూ <<>>జేబులు గుల్ల చేస్తున్నాయి. ఒక టికెట్ ₹500-800 అయితే, పాప్‌కార్న్ ఖర్చు కలిపి ఇద్దరు వెళ్తే ₹2000 ఆవిరి కావాల్సిందే. OTTలో చూడాలంటే ఆ రేట్లు భరించలేక ప్రతీ సినిమాకు స్పెషల్ రేట్లు పెట్టలేక పైరసీ వైపు మొగ్గుచూపుతున్నట్లు అభిమానులు చెబుతున్నారు.