News March 18, 2024
టికెట్ దొరకడం కష్టమే
CSK, RCB మ్యాచ్‌కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. చెన్నై వేదికగా ఈ నెల 22న జరగనున్న ఈ మ్యాచ్ కోసం టికెట్లు అన్నీ బుకింగ్ అయిపోయాయి. ముందస్తు రిజిస్ట్రేషన్ అవకాశం కల్పించడంతో ఫ్యాన్స్ పెద్ద ఎత్తున టికెట్ స్లాట్‌ను బుక్ చేసుకున్నారు. తాజాగా పేటీఎం ఇన్‌సైడర్‌లో టికెట్ బుకింగ్ ఓపెన్ కాగా ప్రస్తుతం ‘YOU ARE NOW IN THE QUEUE’ అని చూపిస్తోంది. టికెట్ల ధరలు రూ.1,700 నుంచి రూ.7,500 వరకు ఉన్నాయి.
Similar News
News January 9, 2025
తిరుపతి బయల్దేరిన సీఎం చంద్రబాబు
AP: సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని నివాసం నుంచి తిరుపతికి బయల్దేరారు. నిన్న తొక్కిసలాటలో గాయపడి స్విమ్స్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించనున్నారు. కాగా, ఘటనకు సంబంధించి నివేదిక ఇప్పటికే ఆయన వద్దకు చేరింది. ఘటన అనంతర పరిణామాలపై అధికారులతో సమీక్షించిన తర్వాత ఆయన తిరుపతి బయల్దేరారు. తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే.
News January 9, 2025
రేపు తిరుమలకు సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు తిరుమల వెళ్లనున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా కుటుంబ సమేతంగా ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. వేంకటేశ్వరస్వామి వైకుంఠ ద్వార ప్రొటోకాల్ దర్శనాలు రేపు తెల్లవారుజామున 4.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచి ఈ నెల 19 వరకు పది రోజుల పాటు వైకుంఠ ద్వారా దర్శనాలు జరగనున్నాయి.
News January 9, 2025
తొక్కిసలాట ఘటన.. రెండు కేసులు నమోదు
AP: తిరుపతి తొక్కిసలాట ఘటనలో రెండు కేసులు నమోదయ్యాయి. బైరాగిపెట్టెడ వద్ద తొక్కిసలాట ఘటనపై ఈస్ట్ పీఎస్‌లో నారాయణపురం ఎంఆర్వో, విష్ణు నివాసంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై బాలయ్యపల్లె ఎంఆర్వో ఫిర్యాదు చేశారు. నిన్న రాత్రి టోకెన్లు జారీ చేసే క్రమంలో పెద్ద ఎత్తున భక్తులు రావడంతో మూడు చోట్ల తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, 40 మందికి పైగా గాయపడ్డారు.