News January 29, 2025

మహా కుంభమేళాలో తీవ్ర విషాదం

image

మౌని అమావాస్య సందర్భంగా మహా కుంభమేళాకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. దీంతో అర్ధరాత్రి <<15295646>>తొక్కిసలాట<<>> జరిగి పలువురు మహిళలు, చిన్నారులు గాయపడ్డారు. ఘటనాస్థలంలో భక్తుల బ్యాగులు, ఇతర వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉండటం ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోంది. కొంతమంది మహిళల మృతదేహాలు ఆసుపత్రి ఫ్లోర్‌లో ఉన్నాయంటూ కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఘటనపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.

Similar News

News January 9, 2026

అంతరిక్షంలో అనారోగ్యం.. ముందే తిరిగొస్తున్న వ్యోమగాములు

image

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి నలుగురు వ్యోమగాములు నెల ముందే భూమికి తిరిగి వస్తున్నారు. ఒక ఆస్ట్రోనాట్‌కు ఎదురైన ‘సీరియస్ మెడికల్ కండిషన్’ వల్ల నాసా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఆ వ్యక్తి పేరు కానీ, హెల్త్ ప్రాబ్లం ఏంటనేది కానీ బయటపెట్టలేదు. ఇది ఎమర్జెన్సీ కాదని, కేవలం ముందు జాగ్రత్త కోసమేనని క్లారిటీ ఇచ్చింది. 2000 నుంచి ISSలో ఇలా మిషన్ మధ్యలోనే ఆపేయడం ఇదే మొదటిసారి.

News January 9, 2026

గర్భాశయ రక్తస్రావం గురించి తెలుసా?

image

మారుతున్న జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు, వయస్సుతో పాటు అనేక గర్భాశయ సంబంధిత సమస్యలు స్త్రీలను ఇబ్బంది పెడుతున్నాయి. వాటిల్లో ఒకటే గర్భాశయ రక్తస్రావం. పీరియడ్స్‌లో అధిక రక్తస్రావం, పీరియడ్స్ మధ్య స్పాటింగ్, సంభోగం తర్వాత రక్తస్రావం ఉన్నా గర్భాశయ రక్తస్రావం అంటారు. ఇది ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత, PCOS, థైరాయిడ్ వల్ల వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

News January 9, 2026

శుక్రవారం ఈ పనులు చేస్తున్నారా?

image

లక్ష్మీదేవికి ప్రీతికరమైన శుక్రవారం రోజున చేసే కొన్ని పనులు దారిద్ర్యానికి దారితీస్తాయని పండితులు చెబుతున్నారు. ‘దేవుడి పటాలు శుభ్రం చేయకూడదు. పాత విగ్రహాలు బయట పడేయకూడదు. అప్పు ఇవ్వడం, తీసుకోవడం చేయవద్దు. జుట్టు, గోళ్లు కత్తిరించకూడదు. ఇంటిని శుభ్రంగా ఉంచితే లక్ష్మీ కటాక్షంతో సిరి సంపదలు కలుగుతాయి’ అని సూచిస్తున్నారు. కుబేర యోగం కలగాలంటే ఏం చేయాలో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.